- Telugu News Photo Gallery Business photos RBI lifts all restrictions on HDFC Bank's business generating activities
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఊరటనిచ్చిన రిజర్వ్ బ్యాంక్.. ఆ ఆంక్షలు తొలగింపు
HDFC: ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరట కల్పించింది. డిజిటల్ 2.0 కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్యక్రమాలపై గతంలో విధించిన ..
Updated on: Mar 12, 2022 | 9:54 PM

HDFC: ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరట కల్పించింది. డిజిటల్ 2.0 కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్యక్రమాలపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ పూర్తిగా తొలగించింది. మార్చి 11న ఆర్బీఐ ఈ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది.

HDFC బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాలలో తరచూ ఇబ్బందులు తలెత్తడాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. దీంతో 2020 డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్2.0 కార్యక్రమం కింద చేపట్టిన లావాదేవీలపై ఆంక్షలు విధించింది.

Bank

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి వినియోగదారులకు డిజిటల్ 2.0 కార్యక్రమం కింద మరింత మెరుగైన సేవలను అందిస్తామని బ్యాంకు తెలిపింది.




