Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది.. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే ఏం జరుగుతుంది..
స్టాక్ మార్కెట్‌కు ఈ వారం చాలా ముఖ్యమైందిగా నిపుణులు చెబుతున్నారు. ఈ వారం హోలీ పండుగ ఉండడం వల్ల మార్కెట్ నాలుగు రోజులే ఉండనుంది..
స్టాక్ మార్కెట్(Stock Market)కు ఈ వారం చాలా ముఖ్యమైందిగా నిపుణులు చెబుతున్నారు. ఈ వారం హోలీ పండుగ ఉండడం వల్ల మార్కెట్ నాలుగు రోజులే ఉండనుంది. మంగళవారం మార్చి 15, US ఫెడరల్ రిజర్వ్(FOMC) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వడ్డీకి సంబంధించి నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. సమావేశం ఫలితాలు మార్చి 16న ప్రకటించే అవకాశం ఉంది. అమెరికాలో పెరిగిన దవ్యోల్బణం(Infletion) కారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీని పెంచే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశ నిర్ణయం, రష్యా -ఉక్రెయిన్ వివాదం.. ఈ వారం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
“FOMC సమావేశం, రష్యా-ఉక్రెయిన్ వివాదం ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మార్చి 16న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసి) సమావేశం ఫలితాలు రానున్నాయని.. వీటన్నింటి మధ్య ముడిచమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కూడా భారత మార్కెట్లకు ముఖ్యమని మీనా అన్నారు. “తక్కువ ట్రేడింగ్ సెషన్‌లతో ఇది ఒక వారం అవుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. మార్కెట్ పార్టిసిపెంట్లు సోమవారం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపి) డేటాపై స్పందిస్తారు. అదేవిధంగా, వినియోగదారుల ధరల సూచిక, టోకు ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం డేటా కూడా రావలసి ఉంది. మార్చి 16న US సెంట్రల్ బ్యాంక్ సమావేశం ఫలితాలు వెలువడనున్నాయి. అందరి దృష్టి వారిపైనే ఉంటుంది.” గత వారం, 30 షేర్ల BSE సెన్సెక్స్ 1,216.49 పాయింట్లు పెరిగింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 385.10 పాయింట్ల లాభంలో ఉంది.
“అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని.. ఇప్పుడు మార్కెట్ సమీప భవిష్యత్తులో ఇతర ముఖ్యమైన అంశాలకు ప్రతిస్పందిస్తుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా తెలిపారు. మార్కెట్ ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణపై రిజర్వ్ బ్యాంక్ ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుందన్నారు. రూపాయి అస్థిరత, ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వైఖరి కూడా మార్కెట్ దిశను ప్రభావితం చేయనున్నాయి.
Read Also.. ICICI Fixed Deposit: హోలీ పండగకు ముందు గుడ్‌న్యూస్ తెలిపిన ఐసీఐసీఐ బ్యాంకు.. వడ్డీ రేట్లు పెంపు