LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ ఎప్పుడొస్తుంది.. మే 12 వరకే గడువు.. ఆ తర్వాత..
ఎల్‌ఐసీ ఐపీఓ(LIC IPO) తీసుకురావడానికి మే 12 గడువు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. LICలో 5 శాతం వాట అంటే దాదాపు 316 మిలియన్ షేర్లు విక్రయం కోసం మార్చిలో IPO తీసుకురావాలని ప్రభుత్వం ముందుగా ప్రణాళిక వేసింది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.60,000 కోట్లు సమీకరించాలని భావించారు...
ఎల్‌ఐసీ ఐపీఓ(LIC IPO) తీసుకురావడానికి మే 12 గడువు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. LICలో 5 శాతం వాట అంటే దాదాపు 316 మిలియన్ షేర్లు విక్రయం కోసం మార్చిలో IPO తీసుకురావాలని ప్రభుత్వం ముందుగా ప్రణాళిక వేసింది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.60,000 కోట్లు సమీకరించాలని భావించారు. అయితే రష్యా -ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ అస్థిరత దృష్ట్యా IPO ప్రణాళిక పట్టాలు తప్పింది. సెబీ(Sebi)కి దాఖలు చేసిన పత్రాల ఆధారంగా ఐపీఓ తీసుకురావడానికి మే 12 వరకు తమకు సమయం ఉందని ఒక అధికారి తెలిపారు. మేము అస్థిరతను పర్యవేక్షిస్తున్నాం, ధర పరిధితో పాటు త్వరలో RHPని ఫైల్ చేస్తాము. మే 12 నాటికి ప్రభుత్వం IPOని తీసుకురాలేకపోతే, డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను పేర్కొంటూ సెబీకి తాజా పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.
గత పక్షం రోజుల్లో మార్కెట్‌లో ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టినప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నమ్మకంగా ఉండేందుకు మార్కెట్ మరింత స్థిరపడే వరకు వేచి చూడాల్సి ఉంటుందన్నారు. LIC తన మొత్తం IPO పరిమాణంలో 35 శాతం వరకు రిటైల్ పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసిన భాగాన్ని పూర్తిగా పూరించడానికి దాదాపు రూ.20,000 కోట్లు అవసరమని అధికారి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఎల్‌ఐసీ లాభం అనేక రెట్లు పెరిగింది. అయితే, మొత్తం ప్రీమియంలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించింది. ఎల్‌ఐసి ఇచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ త్రైమాసికంలో దాని లాభం రూ. 234.9 కోట్లుగా ఉంది.
ఎల్‌ఐసీ ఐపీఓ సహాయంతో 60 వేల కోట్ల నిధిని సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలలో ఈ IPO వస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇది జరగకపోతే ప్రభుత్వం మరోసారి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతుంది. 2022 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాత డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యమైన 1.75 లక్షల కోట్లను 78 వేల కోట్లకు తగ్గించారు. ఇప్పటివరకు డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.13 వేల కోట్లు మాత్రమే సమీకరించిన ప్రభుత్వం.. ఎల్‌ఐసీలో తన 5 శాతం వాటాను విక్రయించనుందని విశ్వసనీయ సమాచారం.
Read Also.. Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది.. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే ఏం జరుగుతుంది..