Paytm CEO: పేటీఎం సీఈఓ విజయ్ అరెస్ట్.. వెంటనే బెయిల్.. అసలేం జరిగిందంటే..?
Paytm CEO Vijay Shekhar Sharma: పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఆయనకు బెయిల్ కూడా లభించింది.
Paytm CEO Vijay Shekhar Sharma: పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఆయనకు బెయిల్ కూడా లభించింది. గత నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యంగా కారు నడిపి మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో విజయ్ శేఖర్ శర్మను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 22న మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ల్యాండ్ రోవర్ కారులో ప్రయాణిస్తున్న విజయ్ శేఖర్ శర్మ.. వేగంగా వచ్చి డీసీపీ బెనితా మేరీ జైకర్‌కు చెందిన కారును ఢీకొట్టారు. అయితే, విజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఆ సమయంలో డీసీపీ కారును పెట్రోల్ కొట్టించడానికి తీసుకెళ్తున్న డ్రైవర్ దీపక్ కుమార్.. విజయ్ కారు నెంబర్‌ను రాసుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని డీసీపీకి తెలియజేయడు. దీంతో డీసీపీ కారు నెంబర్ ద్వారా విచారణ జరపాలని సిబ్బందిని ఆదేశించారు.
అయితే.. దర్యాప్తు జరిపిన పోలీసులు కారు గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీకి చెందినదని గుర్తించి అక్కడకు వెళ్లి విచారించారు. అయితే.. తీరా అది పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు సంబంధించిన కారు అని తేలింది. దీంతో వెంటనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బెయిలబుల్ సెక్షన్ల కింద మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. ఆయన్ను అదుపులోకి తీసుకున్న కాసేపటికే వదిలేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: