India’s GDP: 2023లో జీడీపీ వృద్ధి రేటును తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ.. కీలకంగా మారిన ఆ అంశాలు..
India's GDP: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలతో ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీల రికవరీపై(Economic Recovery) తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ(Morgan Stanley) అంచనా వేసింది.
India’s GDP: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలతో ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీల రికవరీపై(Economic Recovery) తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ(Morgan Stanley) అంచనా వేసింది. ఈ అంచనాలకు అనుగుణంగా దేశ జీడీపీ వృద్ధిని 7.9 శాతానికి పరిమితం చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకోనున్న అంచనా వేసిన సదరు సంస్థ.. దీని వల్ల కరెంట్ అకౌంట్ లోటు మరో మూడు శాతం పెరగనున్నట్లు లెక్కగట్టింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత నెమ్మదిగా జరగనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ పరిణామాల కారణాలతో ఇతర అంశాల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలో ప్రతిస్టంభన కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.
భారత్ ప్రధానంగా పెరుగుతున్న కమోడిటీలు, క్రూడ్ ధరల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేస్తాయని తెలిపింది. 85 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనే దేశం ఆధారపడటం వల్ల దేశం ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొంది. ధరల పెరుగుదల వచ్చే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలపై, వ్యాపారాలపై, ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపింది.
మ్యాక్రో ఎకానమీలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయంది. ఇందుకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు తన పాలసీలో మార్పులు చేయాలని సూచించింది. రానున్న జూన్ ఆర్బీఐ మానిటరీ పాలసీలో రెపో రేటు పెంచే అవకాశం ఉందని తెలిపింది. దీనికి తోడు ఏప్రిల్ పాలసీ మీటింగ్ లో రివర్స్ రెపో రేటును సైతం పెంచవచ్చని పేర్కొంది. ఇందుకు ఇంధన టాక్స్ రేట్ల తగ్గింపు, ఉపాధి హామీ పథకాలు కొంతమేర ఉపశమనంలా పనిచేస్తాయని చెబుతోంది.
ఇవీ చదవండి..