Telangana: తెలంగాణకు రూ.1,040 కోట్ల అరబ్ పెట్టుబడులు
దుబాయ్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ మేరకు ఆయన కొన్ని వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడులు, వాణిజ్య అనుకూలతలకు సంబంధించి వారికి తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా కొన్ని సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుచ్చాయి. మంగళవారం రోజున మొదటిరోజే 1,040 రూపాయల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

దుబాయ్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ మేరకు ఆయన కొన్ని వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడులు, వాణిజ్య అనుకూలతలకు సంబంధించి వారికి తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా కొన్ని సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుచ్చాయి. మంగళవారం రోజున మొదటిరోజే 1,040 రూపాయల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అగ్నిమాపక పరికరాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో.. రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అలాగే ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్’తో కలిసి అంతర్జాతీయ స్థాయి ‘ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ’ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ చేసిన ప్రతిపాదనకు కూడా ఆయన అంగీకరించారు.
సుమారు 100కి పైగా దేశాల్లో తమ సంస్థల నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు రాష్ట్రానికి దాదాపు 215 కోట్ల పెట్టుబడితో తమ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డీపీ వరల్డ్ పేర్కొంది. ఈ సంస్థ అధికారులు మంత్రి కేటీఆర్‌తో దూబాయ్‌లో సమావేశమయ్యారు. పోర్ట్ ఆపరేటర్‌గా ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచిన డిపీ వరల్డ్ హైదరాబాద్‌లో తన ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్ కోసం 165 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీపీ వరల్డ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ ప్రగతికి చేదోడుగా ఉండే కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ రంగంలో తాము పెట్టినట్లు చెప్పారు. ఇక మేడ్చల్ ప్రాంతంలో 50 కోట్ల రూపాయలతో.. 5 వేల ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్‌హౌస్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తామని లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. అయితే ఈ మేరకు ఆయనతో కేటీఆర్‌తో మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో సహా షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో తమ సంస్థ సాగిస్తున్న కార్యకలాపాలను మంత్రికి యూసుఫ్ అలీ వివరించారు. ఇక తమ సానుకూల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రానున్న ఆక్వా క్లస్టర్‌లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు సేకరిస్తామని చెప్పారు. అయితే దీనికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లను నెలకొల్పుతామని.. దీనివల్ల 500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని యూసఫ్ చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




