AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అద్దెకు తీసుకుంటాడు.. ఆపై తానే ఓనర్ అని అమ్ముకుంటాడు.. ఈ కేటుగాడి కథ తెలిస్తే షాక్ అవుతారు..

Hyderabad News: కొందరు ఉంటారు.. కష్టపడకుండానే విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తారు. ఇందుకోసం వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమ బ్రెయిన్‌కు పని చెప్పి.. స్కెచ్‌ల మీద స్కెచ్‌లు గీస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి కన్నింగ్ ఐడియాలే చేశాడు. కానీ, కథ అడ్డం తిరిగి.. కటకటాల పాలయ్యాడు. కారు అద్దెకు తీసుకుని.. ఆ కార్లకు తానే ఓనర్ చెప్పకుని వాటిని అమ్ముకునే వాడు ఈ కేటుగాడు. అయితే, మ్యాటర్ రివీల్ అవడంతో.. పోలీసులు అతన్ని చెరసాలకు తరలించారు.

Hyderabad: అద్దెకు తీసుకుంటాడు.. ఆపై తానే ఓనర్ అని అమ్ముకుంటాడు.. ఈ కేటుగాడి కథ తెలిస్తే షాక్ అవుతారు..
Arrest
Noor Mohammed Shaik
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 06, 2023 | 8:26 AM

Share

Hyderabad News: కొందరు ఉంటారు.. కష్టపడకుండానే విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తారు. ఇందుకోసం వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమ బ్రెయిన్‌కు పని చెప్పి.. స్కెచ్‌ల మీద స్కెచ్‌లు గీస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇలాంటి కన్నింగ్ ఐడియాలే చేశాడు. కానీ, కథ అడ్డం తిరిగి.. కటకటాల పాలయ్యాడు. కారు అద్దెకు తీసుకుని.. ఆ కార్లకు తానే ఓనర్ చెప్పకుని వాటిని అమ్ముకునే వాడు ఈ కేటుగాడు. అయితే, మ్యాటర్ రివీల్ అవడంతో.. పోలీసులు అతన్ని చెరసాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కిన ఓ యువకుడు.. అద్దెకు తీసుకున్న కార్లను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమంగా అమ్మేసేవాడు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నంచి రూ. 1.20 కోట్ల విలువైన 8 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం.. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ మనోజ్ కుమార్.

సనత్​నగర్​డీఎన్ఎం కాలనీకి చెందిన మొహమ్మద్​అస్లాం నవాజ్(33) 2021లో సనత్​నగర్‌లో కార్ల అద్దె వ్యాపారాన్ని ప్రారంభించారు. నవాజ్ కార్ల యజమానులతో కలిసి లీజు, అద్దె, హైపోథెకేషన్​ఒప్పందాన్ని కుదర్చుకుని కార్లను తన వ్యాపారం కోసం ఉపయోగించుకునేవాడు. నవాజ్.. 8 కార్ల యజమానులతో వేరువేరుగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అద్దె పేరు మీద కార్లను తీసుకున్నాడు. రెండు మూడు నెలల పాటు కార్లను బట్టి 20వేల నుంచి 30 వేల వరకు యజమానులకు అద్దె బాగా చెల్లిస్తున్నట్లు నటించాడు.

ఆ తర్వాత ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ కార్లన్నీ తనవేనని చెప్పి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు మార్టిగేజ్​లోన్​లను తీసుకున్నాడు. తన విలాసవంతమైన జీవితం కోసం వాహన యజమానులకు తెలియకుండా.. అద్దెకు తీసుకున్న కార్లను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి తక్కువ ధరకు విక్రయించాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం మారుతీవిటారా బ్రీజా కారులో వెళ్తున్న మొహమ్మద్​అస్లాం నవాజ్‌ను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలలో విక్రయించిన టాటా ఆలట్రోజ్ , మారుతీ విటారా బ్రీజా, మారుతి సుజుకీ బెలోనో, 5 మారుతి సుజుకీ ఎర్టిగా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..