Telangana: రోడ్డుపై ప్రజా పాలన అప్లికేషన్లు.. సర్కార్ సీరియస్.. అధికారులపై సస్పెన్షన్ వేటు
రోడ్లపై ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రజలు గంటలకొద్దీ లైన్లలో నిలబడి ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తులు పెట్టుకుంటే..ఆ అప్లికేషన్‌లు పాన్ షాప్‌లోకి ఎలా వెళ్లాయంటూ నెట్‌జన్స్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారు

ప్రజాపాలన అభయ హస్తం కార్యాక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కోటి 8 లక్షల 94 వేల అని లెక్క తెరపైకి వచ్చింది. డేటా బేస్ పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. అయితే అభయ హస్తం పథకంపై అలా అభయం వచ్చిందో లేదో.. ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్లపై ప్రత్యక్షకావడం సంచలనం రేపింది. ఎన్నో ఆశలతో ప్రజలు ఇచ్చిన అప్లికేషన్లు రోడ్లపై చిత్తు కాగితాల్లా పడిపోవడం చర్చగా . రచ్చగా కూడా మారింది. రోడ్లపై ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రజలు గంటలకొద్దీ లైన్లలో నిలబడి ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తులు పెట్టుకుంటే..ఆ అప్లికేషన్‌లు పాన్ షాప్‌లోకి ఎలా వెళ్లాయంటూ నెట్‌జన్స్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారు. ప్రజలకు సంబంధించిన డేటా సైబర్ నేరగాళ్లకు చేరకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారాయన. కాగా ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్డు మీద ప్రత్యక్ష కావడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. అభయహస్తం దరఖాస్తులు.. బాలానగర్ ఫ్లైఓవర్‌పై కనిపించడంపై సీరియస్ అయ్యారు GHMC కమిషనర్.
ఘటనపై పూర్తి వివరాలు అందించాలని డిప్యూటీ జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. రోడ్డుపై పడిన దరఖాస్తులు హయత్ నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా.. వాళ్లు ర్యాపిడో వెహికిల్‌పై దరఖాస్తులు తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో ర్యాపిడో బైక్ స్కిడ్ అయి కిందపడటంతో.. రోడ్డుపై పడిపోయాయి దరఖాస్తులు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డేటా ఎంట్రీ టీమ్ లీడర్స్‌ను సస్పెండ్ చేశారు.
కేటీఆర్ ట్వీట్..
I’ve been watching & hearing from concerned citizens about numerous videos of Praja Palana applications being mishandled carelessly by certain private individuals. These application forms contain sensitive data of Crores of Telangana citizens
I urge the state government to take… pic.twitter.com/CPA5DJqwUr
— KTR (@KTRBRS) January 9, 2024
భట్టి విక్రమార్క్ రియాక్షన్ ఇదే..
The Formula E race in Hyderabad has proven to be a failure, resulting in a substantial budget loss of almost ₹110 crores for the state government. This significant financial impact raises concerns about the justification for spending such a large sum solely for a potential image… pic.twitter.com/LXJWcrkovR
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 9, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




