తెలంగాణ సీఎంను కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ బృందం.. ఏం మాట్లాడారంటే.?

అక్షయ పాత్ర ఫౌండేషన్ రీజినల్ ప్రెసిడెంట్ సత్య గౌరచంద్ర దాస తెలంగాణ సీఎం రేవంత్‌కు లక్ష్మీ నరసింహస్వామి చిత్ర పటాన్ని, భగవద్గీతను అందజేశారు. ఒక్క తెలంగాణలోనే కాదు.. యావత్ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా..

Ravi Kiran

| Edited By: Phani CH

Updated on: Jan 10, 2024 | 5:51 PM

ఎలాంటి లాభాన్ని ఆశించకుండా పిల్లలకు, విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పధకాన్ని అందిస్తోంది 'అక్షయ పాత్ర ఫౌండేషన్'. ఇటీవల ఈ ఫౌండేషన్ సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

1 / 5
అక్షయ పాత్ర ఫౌండేషన్ రీజినల్ ప్రెసిడెంట్ సత్య గౌరచంద్ర దాస తెలంగాణ సీఎం రేవంత్‌కు లక్ష్మీ నరసింహస్వామి చిత్ర పటాన్ని, భగవద్గీతను అందజేశారు. ఒక్క తెలంగాణలోనే కాదు.. యావత్ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది 'అక్షయ పాత్ర ఫౌండేషన్'.

2 / 5
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను బృందం సీఎం రేవంత్‌కు వివరించగా.. ఆయన ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. దేశంలో ఆకలి, పోషకాహార లోపం లాంటి సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా పని చేస్తోంది అక్షయ పాత్ర ఫౌండేషన్.. ప్రతీ చిన్నారి ఆకలి కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో.. మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తోంది.

3 / 5
ఎయిడెడ్​ పాఠశాలలోని విద్యార్థులు ఆకలితో లేకుండా ఉండేలా, అదే సమయంలో పిల్లలను తిరిగి పాఠశాలలకు తిరిగి తీసుకొచ్చే దిశగా కృషి చేస్తోంది. దేశంలోని 15 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తంగా 20 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పధకాన్ని అందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌండేషన్‌గా ఎదిగింది.

4 / 5
ఇక తెలంగాణలో సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 5 అత్యాధునిక వంటశాలలు ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రతీ రోజూ 2 లక్షలకుపైగా విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది.

5 / 5
Follow us