Vivo Y28 5G: రూ. 13 వేలలోనే సూపర్ ఫీచర్స్‌.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే భారత్‌లో పలు మోడల్స్‌ను లాంచ్‌ చేసిన వివో.. తాజాగా వివో వై28 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది...

Narender Vaitla

|

Updated on: Jan 09, 2024 | 11:56 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో.. భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై28 పేరుతో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. జనవరి 8వ తేదీన ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వివో వై28 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,999కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,499గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 16,999గా ఉంది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌తో పాటు వివో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసిని వారికి అదనంగా రూ. 1500 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

3 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720x1,612 పిక్సెల్‌, 90Hz రిఫ్రెష్ రేట్, 840 nits బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ 7nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 15వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను అందించారు. ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను సైడ్‌కు అందించారు.

5 / 5
Follow us