రెడ్ మీ నోట్ 13 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ మాలి జీ57 జీపీయూతో అనుసంధానమైన మీడియా టెక్ డైమెన్సిటీ 6080చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని మునుపతి తరం ఫోన్ తో పొలిస్తే ఈ కొత్త అప్ డేటెడ్ ఫోన్లో కెమెరాల పరంగా అప్ గ్రేడ్ ను పొందుతుంది. దీనిలో 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 12ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో బ్యాటరీ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్
120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఇి 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐపీ54 స్ప్లాష్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్‌గా ఈ ఫోన్ ఉంటుంది.