AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు మీకోసం..

Hyderabad Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు మీకోసం..
Ganesh
Shiva Prajapati
|

Updated on: Sep 18, 2021 | 12:43 PM

Share

Hyderabad Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్థరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధాజ్ఞలు పెట్టారు. ఆర్టీసీ బస్సులను సైతం పలు చోట్ల దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర సాగే మార్గం మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచించారు. అంతేకాదు.. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

గణేష్ నిమజ్జన యాత్ర గూగుల్ రూట్ మ్యాప్.. 1. బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర, ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్‌టీఆర్ మార్గ్‌కు వినాయక విగ్రహాలను తరలించనున్నారు. 2. బేగం బజార్, ఉస్మాన్ గంజ్, అఫ్జల్​గంజ్, గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. 3. సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్‌టీఆర్ మార్గ్ వైపునకు విగ్రహాల మళ్లిస్తారు. 4. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. 5. దిల్‌సుఖ్​నగర్, ఐఎస్​సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా సాగనుంది. 6. టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్‌టీఆర్​మార్గ్​వైపునకు మళ్లించనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు మెహిదీపట్నం, తపచ్ బుత్రా, అసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి. ఈ రూట్ మ్యాప్‌లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్‌టీఆర్​మార్గ్‌కు చేరుకోనుంది. ఈ మార్గంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించించనున్నారు. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఏర్పాటు చేశారు. బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు.

Also read:

Viral Video: స్పైడర్ మ్యాన్‏కు చెల్లిలా ఉందే పాప.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా..

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో 19 హ్యాట్రిక్‌లు.. లిస్టులో ఈ ముగ్గురు భారత బౌలర్లను చూస్తే ఆశ్చర్యపోతారంతే..!

Love Story: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురానున్న లవ్ స్టోరీ..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా