Viral Video: స్పైడర్ మ్యాన్‏కు చెల్లిలా ఉందే పాప.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో చిన్నారులు ఎంత యాక్టివ్‏గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను ఉన్న విన్యాసాలను చూస్తూ..

Viral Video: స్పైడర్ మ్యాన్‏కు చెల్లిలా ఉందే పాప.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా..
Vrial
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 18, 2021 | 12:39 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో చిన్నారులు ఎంత యాక్టివ్‏గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను ఉన్న విన్యాసాలను చూస్తూ.. వారు ట్రై చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారు చేసే అల్లరి చేష్టలు.. భయంలేకుండా చేసే విన్యాసాలు వారి ప్రాణాల మీదకు తెస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించిన వీడియోలను నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులో కొందరు అద్భుతంగా డ్యాన్స్ చేయడం.. పాటలు పాడడం.. లేదంటే.. గుంపుగా ఒకచోట చేసి తమ ప్రతిభను బయటపెట్టడం చేస్తున్నారు. అయితే ప్రమదాకరమైన స్టంట్స్ చేయడంలోనూ తామేమి తక్కువ కాదంటూ ఇటీవల కొందరు చిన్నారులు నిరూపించారు కూడా. తాజాగా ఓ చిన్నారి చేసిన విన్యాసాలు చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో చూస్తున్నంతసేపు ఆశ్చర్యంమే కాకుండా.. ఒకింత భయం కూడా కలుగుతుంది. ఆ పాప చేసే విన్యాసాలు కాస్త పట్టు తప్పిన ఇక అంతే సంగతులు. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందో తెలుసుకుందామా.

గత కొద్ది రోజులుగా నెట్టింట్లో ఓ చిన్నారికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆ చిన్నారి గోడకు మూలన.. వ్యతిరేకంగా కేవలం కాళ్లు.. చేతులతో తాకుతూ.. ఎలాంటి వస్తువు సహయం లేకుండా స్పైడర్ మెన్‏లా పాకుతుంది. నిమిషంలోనే ఇంటి పైకప్పుడు వరకు పాకి.. అక్కడే కాసేపు ప్రమాదకరమైన విన్యాసాలు చేసింది. కాళ్లు, చేతులు ఆడిస్తూ.. స్టంట్స్ చేసింది. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా పాకుతూ కిందకు చేరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. స్పైడర్ మెన్ కూతురులా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజాంగానే ఈ చిన్నారి చేస్తున్న స్టంట్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంతేకాదు.. ఈ పాప సాహసానికి.. విన్యాసాలను చూస్తుంటే.. చిన్నారి ధైర్యానికి ఫిదా అవ్వడం కూడా ఖాయమే. మరి ఆ చిన్నారి చేసిన అద్భుతమైన సాహస విన్యాసాలపై మీరు ఓ లుక్కెయ్యండి.

Also Read: Pooja Hegde : స్టార్ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టేసిన బుట్టబొమ్మ.. అమ్మడి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..