Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..

సమంత అక్కినేని... ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సామ్.. అటు డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చూపిస్తుంది.

Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..
Samantha

సమంత అక్కినేని… ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సామ్.. అటు డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చూపిస్తుంది. ఇటీవల ఫ్యామిలీ మెన్ 2 సిరీస్‏లో సామ్ నటనకు విమర్శకులు సైతం ముగ్దులయ్యారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాల్లోనే కాకుండా.. ఓటీటీలోనూ ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇక అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా సామ్ వరుస సినిమాలతో బిజీగా ప్రొఫెషనల్ కెరీర్ కొనసాగిస్తోంది. అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సమంత… నాగచైతన్య దాంపత్య జీవనం గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు సామ్ గానీ… అటు నాగచైతన్య కుటుంబం కానీ స్పందించలేదు. కానీ సమంత మాత్రం నిత్యం సోషల్ మీడియా ఖాతాల్లో ఫుల్ యాక్టీవ్‏గా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఇందులో శకుంతల పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తై.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం సమంత మరో ప్రాజెక్ట్‎కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించే సినిమాలో సమంత ప్రధాన పాత్రలో కనిపించబోతుందని టాక్. ఇందుకు సామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. ఇక సామ్ కొత్త చిత్రానికి నూతన దర్శకుడు ఉండనున్నాడని తెలుస్తోంది. ఇక శివలెంక ప్రసాద్.. ఇప్పటికే ఆదిత్య 369, వంశానికొక్కడు, నాని జెంటిల్ మెన్, సమ్మోహనం వంటి హిట్ మూవీస్ నిర్మించాడు.

ప్రస్తుతం సమంత పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథల వైపుకు మాత్రమే ఆసక్తి చూపిస్తుంది. పెళ్లి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ. సూపర్ హిట్స్ అందుకుంటుంది అక్కినేని వారి కొడలు. ఇక ప్రస్తుతం శివలెంక ప్రసాద్ నిర్మాణంలో రాబోయే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Also Read: Maharshi Movie : మహేష్ ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. బెస్ట్ యాక్టర్‌గా మరోసారి సూపర్ స్టార్..

Allu Arjun: మేడమ్ సర్ మేడమ్ అంతే.. అల వైకుంఠపురంలో క్రేజ్ అస్సలు తగ్గడంలేదుగా….

Bigg Boss 5 Telugu: బెస్ట్ పర్ఫామర్‏గా నటరాజ్ మాస్టర్.. వరస్ట్ పర్ఫామర్‏గా ఆ కంటెస్టెంట్.. సీన్ రివర్స్ అయ్యిందిగా..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu