Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బెస్ట్ పర్ఫామర్‏గా నటరాజ్ మాస్టర్.. వరస్ట్ పర్ఫామర్‏గా ఆ కంటెస్టెంట్.. సీన్ రివర్స్ అయ్యిందిగా..

బిగ్‏బాస్ సీజన్ 5 ఇంట్లో 12వ రోజు మరోసారి గొడవలతో రచ్చ చేశారు. ఆరంభం నుంచి గొడవలతో ... అరుపులు, ఏడుపులతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు.

Bigg Boss 5 Telugu: బెస్ట్ పర్ఫామర్‏గా నటరాజ్ మాస్టర్.. వరస్ట్ పర్ఫామర్‏గా ఆ కంటెస్టెంట్.. సీన్ రివర్స్ అయ్యిందిగా..
Sunny
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 18, 2021 | 9:34 AM

బిగ్‏బాస్ సీజన్ 5 ఇంట్లో 12వ రోజు మరోసారి గొడవలతో రచ్చ చేశారు. ఆరంభం నుంచి గొడవలతో … అరుపులు, ఏడుపులతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇక తాజాగా నిన్నటి ఎపిసోడ్‏లోనూ మరోసారి సీరియస్ ఇష్యూ నడిచింది. అలాగే ఈసారి సరికొత్తగా ట్రయంగిల్ లవ్ స్టోరీస్ కూడా బయటపడుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ముందుగా.. ఆర్ఆర్ఆర్ దోస్తీ పాటకు స్టె్ప్పులేశారు కంటెస్టెంట్స్. ఆ తర్వాత కెప్టెన్ అయిన విశ్వ ఇంటి సభ్యులకు నిమయ నిబంధనల ఉల్లంఘన గురించి వివరించారు. ఇక ఆ తర్వాత బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే టాస్క్ గురించి ప్రియ చెప్పుకొచ్చింది. ఇందులో కంటెస్టెంట్స్ బజర్ మోగగానే బంతిని పట్టుకోవాలి. ఒక్కో బంతి పై ఒక్కో ఐటం పేరు రాసి ఉంటుంది. ఆ బాల్ పట్టుకుంటే ఆ ఫుడ్ ఇంటి సభ్యులకు చెందుతుంది.

ఇక టాస్క్ ప్రారంభం కాగానే.. ముందుగా విశ్వ పేరు వచ్చింది. బాల్ పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నించినా.. ఫలితం రాలేదు. దీంతో రసగుల్ల ఉన్న బాల్ మిస్సయ్యింది. ఓ తర్వాత లహరి మటన్ బిర్యానీ బాల్‏ను వదిలేసింది. ఆ తర్వాత లోబో పన్నీర్ బాల్‏ను వదిలేసాడు. ఉమా దేవీ అల్లంవెల్లుల్లి, షన్ను మటన్, ప్రియాంక కాఫీ ఉన్న బాల్స్ పట్టుకున్నారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఏకాభిప్రాయంతో బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్లను ఎంచుకోమన్నాడు. ఇందులో ముందుగా విశ్వ.. ప్రియాంక సింగ్ త్వరగా రెడీ అయితే బాగుంటుందని చెబుతూ.. ఆమె‏ను వరస్ట్ పర్ఫార్మర్‏గా ఎంచుకున్నాడు. అనంతరం యాంకర్‌ రవి.. యాటిట్యూడ్‌ చూపించాడంటూ సన్నీని ఎంచుకున్నాడు. ఇక శ్వేత.. సిరిని సెలక్ట్ చేసుకుంది.. ఆ తర్వాత మానస్‌.. టాస్క్‌లో సహనాన్ని కోల్పోయిన శ్రీరామ్‌ను ఎంచుకోగా.. ఉమాదేవి.. కాజల్‌, షణ్ముఖ్‌, ప్రియ, సిరి.. సన్నీని, యానీ మాస్టర్‌.. ఉమాదేవిని.. శ్రీరామచంద్ర.. యాంకర్‌ రవిని వరస్ట్‌ పర్ఫామర్లుగా ఎంచుకున్నారు.. అయితే ఇందులో ఎక్కువ ఓట్లు వచ్చిన సన్నీని ఈవారం వరస్ట్‌ పర్ఫామర్‌గా ప్రకటించి అతడిని జైల్లో వేశారు. బెస్ట్ పర్ఫార్మర్‏గా నటరాజ్ మాస్టర్‏ను ఎంచుకున్నారు.

Also Read: Prabhas: మరోసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్.. ఆ బడా ప్రొడ్యూసర్ ప్లాన్ అదుర్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన..

Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’లో ఆ సీన్లు సినిమాకే హైలైట్‌గా ఉండనున్నాయట….