Prabhas: మరోసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్.. ఆ బడా ప్రొడ్యూసర్ ప్లాన్ అదుర్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం... వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‏తో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన తదుపరి చిత్రాల కోసం డార్లింగ్ సరికొత్త లుక్‏లో మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే.

Prabhas: మరోసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్.. ఆ బడా ప్రొడ్యూసర్ ప్లాన్ అదుర్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 18, 2021 | 9:02 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం… వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‏తో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన తదుపరి చిత్రాల కోసం డార్లింగ్ సరికొత్త లుక్‏లో మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. డార్లింగ్‏తో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభాస్… పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మహానటి ఫేమ్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాను ఇటీవలే షూరు చేశాడు డార్లి్ంగ్.

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ప్రభాస్ 25వ సినిమా గురించి నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. మరోసారి ప్రభాస్.. రాజమౌళి కాంబోలో మరో ప్రాజెక్ట్ రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి.. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు దిల్ రాజు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దిల్ రాజు ఏ మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే అటు ప్రభాస్‏తోనూ చర్చలు జరిపినట్లుగా టాక్ వినిపిస్తోంది. అన్ని సెట్ అనుకున్నా.. తర్వాత.. ఈ సినిమా కోసం డైరెక్టర్ ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో మేకర్స్ తర్జనా భర్జనా అయ్యారట. చివరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించాల్సిన ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం చేస్తే బాగుంటుందని భావించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబర్ 22న అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది.

కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్ నైట్‏లో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్. ఇక ఇటీవలే కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తిచేసిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం సలార్ మూవీ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది.

Also Read: Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’లో ఆ సీన్లు సినిమాకే హైలైట్‌గా ఉండనున్నాయట….

EMK Promo: స్టార్ డైరెక్టర్లను ఆడేసుకున్న తారక్.. ఇక్కడ నేనే బాస్.. నేను చెప్పిందే వినాలంటూ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే