EMK Promo: స్టార్ డైరెక్టర్లను ఆడేసుకున్న తారక్.. ఇక్కడ నేనే బాస్.. నేను చెప్పిందే వినాలంటూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం లీడ్ రోల్ పోషిస్తున్నాడు

EMK Promo: స్టార్ డైరెక్టర్లను ఆడేసుకున్న తారక్.. ఇక్కడ నేనే బాస్.. నేను చెప్పిందే వినాలంటూ..
Ntr
Follow us

|

Updated on: Sep 18, 2021 | 8:35 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ తారలు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాతోపాటే.. తారక్.. బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. జెమిని టీవీలో ప్రసారమవుతున్న మీలో ఎవరు కోటీశ్వరులు షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ షో.. మొదటి వారం ఎపిసోడ్స్‏కు మంచి రేటింగ్ దక్కింది. అలాగే పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది మీలో ఎవరు కోటీశ్వరులు షో. ఇక మంచి రేటింగ్‏తో దూసుకుపోతున్న ఈ షో ప్రస్తుతం కాస్త వెనుకబడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం.. మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5. ఇక ఈ పోటీని ఎదుర్కోవడానికి మీలో ఎవరు కోటీశ్వరులు షోలోకి వారం వారం గెస్ట్స్ వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొదటి రోజు రామ్ చరణ్ అతిథిగా వచ్చారు. తాజాగా ఈ షోకు ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ అతిథులుగా రాబోతున్నారు.

అయితే ఈసారి ప్రేక్షకులకు డబుల్ ధమకా ఇవ్వనున్నారు మీలో ఎవరు కోటీశ్వరులు నిర్వాహకులు. ఈసారి సోమవారం స్టార్ డైరెక్టర్స్.. రాజమౌళి, కొరటాల శివ రాబోతున్నారు. వీరిద్దరూ ఎన్టీఆర్‏తో కలిసి పనిచేసినవారే కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు నిర్వహకులు. ఇక షోకు రావడంతోనే ఇద్దరు డైరెక్టర్స్ తారక్‏ను డైరెక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కెమోరా.. రోల్.. యాక్షన్ అనగానే.. ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. ఇక్కడ అంతా నాదే.. నేనే బాస్‏ను.. నేను చెప్పినట్లుగానే వినాలంటూ చెప్పారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ఇద్దరు చాలా వేగంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తారక్‏తో ఒకే వేదికపై సందడి చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇన్‏స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Gemini TV (@geminitv)

Also Read: Rakul Preet Singh: అందుకోసం డాక్టర్లను ఫాలో అయ్యాను.. నేను రకుల్‏ను మాత్రం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Bhima Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ నుంచి రానా టీజర్.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..