Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: అందుకోసం డాక్టర్లను ఫాలో అయ్యాను.. నేను రకుల్‏ను మాత్రం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

తెలుగుతోపాటు.. హిందీలోనూ వరుస ఆఫర్లను అందుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. గత కొద్ది కాలంగా తెలుగులో రకుల్ సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి.

Rakul Preet Singh: అందుకోసం డాక్టర్లను ఫాలో అయ్యాను.. నేను రకుల్‏ను మాత్రం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..
Rakul
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 18, 2021 | 8:01 AM

తెలుగుతోపాటు.. హిందీలోనూ వరుస ఆఫర్లను అందుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. గత కొద్ది కాలంగా తెలుగులో రకుల్ సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‏కు దూరమైందని.. ఇక్కడ ఆఫర్స్ రావడం లేదంటూ నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేశాయి. ఇక తనపై వస్తున్న కథనాలపై రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తన చేతిలో అరడజను సినిమాలున్నాయని.. కొత్త ప్రాజెక్ట్స్ కోసం టైమ్ కేటాయించేలేకపోతున్నట్లుగా వివరణ ఇచ్చింది. తన డేట్స్ అడ్జెస్ట్ చేసే వాళ్లుంటే.. ఎవరైనా తనను సంప్రదించాలని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న కొండపొలం సినిమాలో నటిస్తోంది రకుల్. అలాగే ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ సినిమాల్లోనే నటిస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్‏లో ఈ అమ్మడు చేతినిండా ప్రాజెక్ట్స్‏తో బిజీగా గడిపేస్తుంది. మేడే, థాంక్ గాడ్ అంటూ అజయ్ దేవగణ్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ ఓ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుంది. అలాగే ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న డాక్టర్ జీ సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో డాక్టర్ ఫాతిమా పాత్రలో రకుల్ కనిపించనుంది. ఈ సందర్భంగా.. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. రకుల్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది. ఈ సినిమా కోసం డాక్టర్లను ఫాలో అయ్యాను. డాక్టర్ కోటు ధరించగానే.. ఏదో బాధ్యతాయుతమైన ఫీలింగ్ నన్ను ఆవహించేది. నేను నిజమైన డాక్టర్‏ను కాననీ. డాక్టర్‏గా నటిస్తున్నానని తెలిసినప్పటికీ ఫాతిమా ఉన్నంతసేపు ఏదో బాధ్యత ఫీలయ్యాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్. పాత్ర పరంగా నేను పేషెంట్స్‏ను ట్రీట్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో.. వారి జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత నేను రకుల్‏ను కాదు అనిపించేది… పూర్తిగా ఆ పాత్రలో లీనమైపోయాను. ఆ అనుభవం నాతో ఎప్పటికీ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అసలు సిక్రెట్‏ను బయటపెట్టేసిన యానీ మాస్టర్..

Bigg Boss 5 Telugu: నీకు తగిన శాస్తి జరిగిందన్న ప్రియా.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్..