AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: ‘సర్కారువారి పాట’లో ఆ సీన్లు సినిమాకే హైలైట్‌గా ఉండనున్నాయట….

మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు.

Sarkaru Vaari Paata: 'సర్కారువారి పాట'లో ఆ సీన్లు సినిమాకే హైలైట్‌గా ఉండనున్నాయట....
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2021 | 8:42 AM

Share

Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే సర్కారువారి పాట సినిమాతో తొలిసారి కీర్తిసురేష్ మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తుంది. హీరో తండ్రి ఒక బ్యాంక్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉంటాడట. ఒక బిజినెస్ మెన్ ఆ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తీసుకుని ఎగ్గొడతాడు. దాంతో రంగంలోకి దిగిన హీరో..ఆ బిజినెస్ మెన్‌తో ఎలా ఆ డబ్బు కంట్టించాడనేదే కథ అంటూ ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉండనున్నాయి. అలాగే అదిరిపోయే కామెడీ కూడా ఉండనుందట ఈ మూవీలో. ఇక సర్కారు వారి పాట మూవీ టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన క్షణాల్లోనే రికార్డుల వేట మొదలు పెట్టింది.

ఇక ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే మహేష్-సముద్రఖని మధ్య కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారట . హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన బ్యాంక్ సెట్‌లో వీటి చిత్రీకరణ జరిగింది. మహేష్-సముద్రఖని మధ్య జరిగే  షూట్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తుంది. సముద్రఖని పాత్ర ఈ సినిమాలో చాలా ఫవర్ ఫుల్‌గా సాగుతుందని సమాచారం. సర్కారు వారి పాట’ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ – 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతికానుకగా ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha Akkineni: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్ సమంత..

Rakul Preet Singh: అందుకోసం డాక్టర్లను ఫాలో అయ్యాను.. నేను రకుల్‏ను మాత్రం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్