AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Akkineni: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్ సమంత..

సినిమా తరాలకు గ్యాప్ దొరికితే విదేశాలు చెక్కేస్తూ ఉంటారు. షూటింగ్‌కు ఏమాత్రం బ్రేక్ దొరికిన ఫ్యామిలీతోనో..స్నేహితులతోనో విదేశాల్లో గడుపుతుంటారు.

Samantha Akkineni: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్ సమంత..
Smantha
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2021 | 8:22 AM

Share

Samantha Akkineni: సినిమా తరాలకు గ్యాప్ దొరికితే విదేశాలు చెక్కేస్తూ ఉంటారు. షూటింగ్‌కు ఏమాత్రం బ్రేక్ దొరికిన ఫ్యామిలీతోనో..స్నేహితులతోనో విదేశాల్లో గడుపుతుంటారు. అయితే అప్పుడప్పుడు తిరులలలో కూడా ప్రత్యక్షం అవుతుంటారు కొందరు. కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి దర్శనానికి సినిమా తారలు రావడం కొత్తేమి కాదు. తమ సినిమాల రిలీజ్ టైమ్‌లో లేదంటే సినిమా సక్సెస్ అయినా సందర్భంలోనో.. తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. తాజాగా అక్కినేని సమంత శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అయితే గతంలోనూ సమంత చాలా సార్లు తిరుమలకు వచ్చారు. Samఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. అలాగే తమిళ్ లో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. కాతు వాకుల రెండు కాదల్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటిస్తున్నారు. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తున్నారని తెలుస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారట. ఇక ఇటీవల నాగ చైతన్య- సమంత విడిపోతున్నారని ఈ మధ్య రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెట్టింది సామ్. చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా సామ్ ఓ పోస్ట్ పెట్టింది. దాంతో ఆవార్తలకు పులిస్టాప్ పడింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..

Bandla Ganesh: ఆసక్తికరంగా బండ్ల గణేష్ సినిమా టైటిల్.. మూవీ పేరు ఏంటో తెలుసా ..

Bigg Boss 5 Telugu: నీకు తగిన శాస్తి జరిగిందన్న ప్రియా.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్..