AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురానున్న లవ్ స్టోరీ..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మరో అందమైన ప్రేమ కథ లవ్ స్టోరీ. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా ఈ సినిమా రూపొందింది.

Love Story: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురానున్న లవ్ స్టోరీ..
Love Story
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2021 | 12:38 PM

Share

Love Story: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మరో అందమైన ప్రేమ కథ లవ్ స్టోరీ. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు,టీజర్ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అలాగే రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఎదో సాధించాలని గ్రామాన్ని విడిచి హైదరాబాద్ వచ్చిన ఓ జంట ఎలా ప్రేమలో పడ్డారు.. ఆ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశారనే కథాంశంగా సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను వినాయక చవితి పురస్కరించుకొని ఈ నెల 10న విడుదల చేయాలనీ చూశారు. అయితే అదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ ద్వారా విడుదల కావడంతో లవ్ స్టోరీ సినిమా వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు ఈ  సినిమాను ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాల్లో లవ్ స్టోరీ సినిమాకు మంచి బజ్ ఉంది. దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఇక ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా, క్షణాల్లో టికెట్లు అమ్ముడవుతున్నాయని తెలుస్తుంది. అలాగే ఇప్పటికే హైదరాబాద్‌లోని మల్టీప్లేక్స్ లో  తొలిరోజు షోలకు సంబంధించిన బుకింగ్స్ చాలావరకూ జరిగిపోయాయని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

HANU-MAN: డిఫరెంట్ లుక్‌లో కుర్రహీరో తేజ సజ్జ.. ఆకట్టుకుంటున్న ‘హను-మాన్’ గ్లిమ్స్‌

Pooja Hegde : స్టార్ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టేసిన బుట్టబొమ్మ.. అమ్మడి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్