HANU-MAN: డిఫరెంట్ లుక్‌లో కుర్రహీరో తేజ సజ్జ.. ఆకట్టుకుంటున్న ‘హను-మాన్’ గ్లిమ్స్‌

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి..ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ సజ్జ. ఇక ఇప్పుడు ఈ కుర్రడు హీరోగా మారి సినిమాలతో అలరిస్తున్నాడు

HANU-MAN: డిఫరెంట్ లుక్‌లో కుర్రహీరో తేజ సజ్జ.. ఆకట్టుకుంటున్న 'హను-మాన్' గ్లిమ్స్‌
Hanu Man
Follow us

|

Updated on: Sep 18, 2021 | 1:43 PM

HANU-MAN: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి..ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ సజ్జ. ఇక ఇప్పుడు ఈ కుర్రడు హీరోగా మారి సినిమాలతో అలరిస్తున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీరెడ్డి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు తేజ. ఈ సినిమాకు హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడాలి విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రశాంత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యాంగ్రీ హీరో రాజశేఖర్‌తో కల్కి అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత మరో సరికొత్త జోనర్‌లో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

ఇక ఇప్పుడు హనుమాన్ అనే సినిమాతో రాబోతున్నాడు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ హనుమంతు అనే పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటుగా ఓ గ్లిమ్స్‌ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌లో తేజ సజ్జా అడవిలో ఒక చెట్టుపై స్లింగ్ షాట్‌తో నిలబడి కనిపిస్తున్నాడు. కోరమీసంతో కనిపిస్తున్న తేజ గెటప్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు తమిళం కన్నడ మలయాళం మరియు హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

HANU-MAN: డిఫరెంట్ లుక్‌లో కుర్రహీరో తేజ సజ్జ.. ఆకట్టుకుంటున్న ‘హను-మాన్’ గ్లిమ్స్‌

Pooja Hegde : స్టార్ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టేసిన బుట్టబొమ్మ.. అమ్మడి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Samantha : లేడీ ఓరియెంటెడ్ కథల వైపే అక్కినేని కోడలు ఆసక్తి.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ