Yashoda Foundation: తెలంగాణ రాష్ట్రంలో యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీకా డ్రైవ్.. ఎక్కడెక్కడ అంటే..
Yashoda Foundation: కరోనా మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగంగా కొనసాగుతోంది. గత ఏడాదికిపై అతలాకుతలం చేసిన కరోనా.. ప్రస్తుతం..
Yashoda Foundation: కరోనా మహమ్మారి అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగంగా కొనసాగుతోంది. గత ఏడాదికిపై అతలాకుతలం చేసిన కరోనా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు తీవ్ర స్థాయిలో కృషి చేసి వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక తెలంగాణలో కూడా టీకాలు వేయడం వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా టీకాలు వేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక తాజాగా యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో టీకాలు వేయడం ప్రారంభిస్తోంది. తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కరోనా టీకాలు వేసేందుకు ముందుకు వచ్చింది. యశోద ఫౌండేషన్ స్థానిక సామాజిక కార్యకర్తల సేవలు తీసుకుంటూ టీకాలు వేయడం ప్రారంభింస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తోంది. టీకాలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరించనుంది. టీకాలు వేయాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 19 (ఆదివారం) నుంచి టీకా డ్రైవ్ ఏర్పాటు చేసింది.
కరోనా నిబంధనలు పాటిస్తూ టీకా డ్రైవ్:
యశోద ఫౌండేషన్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ టీకా డ్రైవ్ నిర్వహిస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ డ్రైవ్ చేపడుతోంది. యశోద ఆస్పత్రి నుంచి అనుభవం ఉన్న వైద్య సిబ్బంది జిల్లాలోని చల్లసముద్రం, వొద్దుగూడెం, రేపల్లెవాడ, ధనియాలపాడు, లచ్చగూడెం తదితర గ్రామాలకు వెళ్లి టీకా డ్రైవ్ నిర్వహించనున్నారు. కరోనాను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. కోవిడ్ 19 తో పోరాడటానికి టీకా ఎలాంటి పాత్ర వహిస్తుందో ప్రజలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అభినవ్ మాట్లాడుతూ.. తెలంగాణాలోని సుదూర ప్రాంతానికి సేవ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. స్థానిక సామాజిక కార్యకర్తలకు, అనేక మంది నాయకులను కలిసి టీకా డ్రైవ్ విజయవంతం అయ్యేలా చేస్తున్నామన్నారు. తమ ఫౌండేషన్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతోందని, పిల్లలకు విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.