AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొత్త బొలెరో కొని మరి హత్యకు ప్లాన్.. సర్పంచ్ ఎన్నికలకు ముందు షాకింగ్ ఘటన

హత్యలు ఎలా పెరుగుతున్నాయో.. చేసే పద్ధతి సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కాదేది హత్యకు కారణం అన్నట్లు తయారైంది నేరస్థుల పరిస్థితి. ఆధారాలు లేకుండా హత్యలు చేసే కొత్త ప్లాన్ ను అనుసరిస్తున్నారు హంతకులు. ఇక నుంచి రోడ్డు ప్రమాదం ఏది ప్రమాదం కాకపోవచ్చు. దాని వెనకాల ఏ పాత కక్షల కళ్ళు ఉన్నాయో యముడికి సైతం తెలియకపోవచ్చు. ఎందకంటే పాత రాజకీయ కక్షలు, భూ వివాదాలకు ఇక్కడో మాజీ సర్పంచ్ బలయ్యాడు.

Telangana: కొత్త బొలెరో కొని మరి హత్యకు ప్లాన్.. సర్పంచ్ ఎన్నికలకు ముందు షాకింగ్ ఘటన
Mbnr Crime
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Nov 27, 2025 | 6:08 PM

Share

జోగులాంబ గద్వాల్ జిల్లాలో నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమా రాయుడు హత్య కేసులో పోలీసులు సంచలన అంశాలు వెల్లడించారు. భీమా రాయుడుది రోడ్డు ప్రమాదం కాదు పక్కా ప్లాన్డ్ పర్ఫెక్ట్ మర్డర్ అని తేల్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఆధారాల్లేని మర్డర్ కు అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అలియాస్ కుర్వ వీరన్న స్కెచ్ వేశాడు. నెల రోజుల రెక్కీ తర్వాత అదును చూసి అమలు చేశారు. ఈ నెల 21న సాయంత్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం జాంపల్లి గ్రామ సమీపంలో చిన్న భీమా రాయుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్న భీమా రాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అందరూ ఇది రోడ్డు ప్రమాదం అనుకున్నారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ ఆకస్మిక మరణంపై అనుమానం కలిగింది. గ్రామస్థులు, ఇతర రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీన్ కట్ చేస్తే ఖాకీల లోతైన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

పోలీస్ దర్యాప్తులో నిజమైన కుటుంబ సభ్యుల అనుమానాలు

ఇక కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అలియాస్ కుర్వ వీరన్న ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో విచారిస్తే సుపారీ మర్డర్ వెలుగులోకి వచ్చింది. భీమా రాయుడుతో రాజకీయ కక్షలు, భూ తగదాల నేపథ్యంలో హత్య చేసినట్లు అంగీకరించాడు వీరన్న. ఇక వీరన్నతో పాటు ఆయన కుమారుడు సురేందర్, ఎనిమిది మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. చిన్న భీమా రాయుడు హత్యకు సుపారీ గ్యాంగ్ తో మొదట రూ.15లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా… ప్లాన్ వేసే సరికి అది కాస్త రూ.25లక్షలకు పెరిగింది.

హత్య కోసం కొత్త బొలెరో వాహనం కొనుగోలు

ఇక భీమా రాయుడు హత్య కోసం కొత్త బొలెరో వాహనమే కొనుగోలు చేశారు నిందితులు. ఆ తర్వాత కర్నూల్ లోని ఆటో నగర్ లో ధృఢమైన బంపర్ ను అమర్చారు. యాక్సిడెంట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో బ్రతకవద్దని ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు. హత్య కోసమే ప్రత్యేకంగా 13కొత్త సిమ్ కార్డులు తీసుకున్నారు. బహిరంగ హత్య కాకుండా రోడ్డు ప్రమాద రూపంలో హత్య చేయాలని భావించారు నిందితులు. ఆ తర్వాత పోలీసులతో సహా అందరూ రోడ్డు ప్రమాదంగా నమ్ముతారని అనుకున్నారు. కానీ ఖాకీల లోతైన దర్యాప్తతో అడ్డంగా బుక్కయ్య జైల్లో ఊసలు లెక్కిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us