AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటుకు నోటు వద్దే వద్దు.. కోతులను తరిమితే చాలు కొత్త సర్పంచ్‌ మీరే

ఓటుకు నోటు వద్దే వద్దు.. కోతులను తరిమితే చాలు కొత్త సర్పంచ్‌ మీరే

Phani CH
|

Updated on: Nov 28, 2025 | 1:10 PM

Share

వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. 5వేల మంది ఓటర్లకు 20వేల కోతులున్న ఈ గ్రామంలో కోతుల బెడద నిత్య నరకంగా మారింది. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తే వారికే ఓటు, వారికే సర్పంచ్ పదవి అని గ్రామస్తులు స్పష్టం చేశారు. రోడ్లు, డబ్బు వద్దు, కోతుల బెడద తొలగించడమే తమ ప్రధాన డిమాండ్.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలంటనే పండుగ వాతావరణం నెలకొంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసేదాకా ఆ కిక్కే వేరు. కానీ.. వరంగల్‌లోని ఈ గ్రామంలో మాత్రం ఓ వింత సమస్య ఆశావహులకు గండంలా మారింది. ఊరంతా ఒకే మాట.. అందరిదీ ఒక్కటే సమస్య. అదే కోతుల బెడద. గ్రామానికి ఇంకే పనీ చేయకపోయినా పర్వాలేదు. కోతుల బెడద తీర్చేస్తే చాలు.. సర్పంచ్‌గా ఎన్నుకుంటామంటోంది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామం. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 5వేల 400 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కోతుల సంఖ్య మాత్రం అంతకు నాలుగు రెట్లు ఎక్కువ.. అంటే, 20 వేలకు పైనే ఉంటాయి. ఆ వానర సేనలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయం, భయం. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఒంటరిగా నడిచి వెళ్ళాలంటేనే జంకుతున్నారు. పొరపాటున ఇంటి డోర్ తెరిచి ఉంచారంటే వంట సామాగ్రి మాయం.. ఇళ్లంతా సంతలా మారుతోంది. అన్నం, కూర గిన్నెలు చెట్లపైకి వెళ్తున్నాయి. కోతుల బెడద నుండి నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ గ్రామస్తులు.. వాటిని తరిమికొట్టిన వారికే సర్పంచ్ పదవి అంటూ ప్రకటించారు. ఎంపీటీసీ పదవి కావాలన్నా ఇదే కండీషన్. కోతుల బాధతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.. స్థానిక ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. గతంలో ఎన్నికల సమయంలో కోతుల సమస్య తీరుస్తామంటూ ఓట్లు వేయించుకున్న నేతలు.. ఆ తర్వాత సరైన శ్రద్ధ పెట్టలేదు. దీంతో కోతుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో.. ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నారు. కోతుల సమస్య తీర్చాల్సిందేనంటూ ఓట్లు అడగడానికి వచ్చే ఆశావహులకు తెగేసి చెప్తున్నారు. ఓటుకు నోటు వద్దే వద్దు. కొత్త రోడ్లు వేయకపోయినా పర్వాలేదు. గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. కేవలం కోతులను తరమండి చాలు.. అని అంటోంది ఇల్లంద గ్రామం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

123 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. 6 నిమిషాల పాటు పూర్తిగా చీకటి

Mosquitoes: ఒక్క సెకనులో 30 దోమలను చంపే సూపర్‌ వెపన్‌

స్మృతి మంథాన పెళ్లికి బ్రేక్‌ పలాష్ మోసం చేశాడా ??

Delhi: పాన్‌ మసాలా కోటీశ్వరుడి ఇంట్లో విషాదం

Weather Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం… ఏపీలో అతి భారీ వర్షాలు

Published on: Nov 28, 2025 10:35 AM