Weather Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం… ఏపీలో అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి, నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలకు భారీ వర్షాలు తీసుకురానుంది. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో వర్షాలు పడనున్నాయి. దక్షిణకోస్తా ,రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆ తరువాత 48 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక శని, ఆదివారల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మలక్కా జలసంధి, ఇండోనేషియాను ఆనుకుని ఉన్న ‘సెన్యార్’ తుపాను తీరం దాటిందని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని, దీని ప్రభావం కూడా ఏపీ, తమిళనాడులపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల 29 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhra King Taluka Review: అక్కడ బిగిస్తే.. సినిమా మరోలా ఉండేదేమో..?
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

