123 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. 6 నిమిషాల పాటు పూర్తిగా చీకటి
2027లో అరుదైన, సుదీర్ఘ సూర్యగ్రహణం రానుంది. 6 నిమిషాలకు పైగా భూమి కారుచీకట్లలో మునిగిపోతుంది. ఇది గత 123 ఏళ్లలో అత్యంత దీర్ఘమైన గ్రహణం. యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యాలలో కనిపిస్తుంది, భారతదేశంలో కనిపించదు. ఈ ప్రత్యేక ఖగోళ దృశ్యం చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో శాస్త్రవేత్తలకు గొప్ప అధ్యయన అవకాశాన్నిస్తుంది.
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. 6 నిమిషాలపాటు ప్రపంచవ్యాప్తంగా కారుచీకట్లు కమ్ముకోనున్నాయి. అవును.. ఇది ఓ అరుదైన సూర్యగ్రహణం కారణంగా సంభవించనుంది. 2027లో అరుదైన దీర్ఘకాలిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఏకంగా 6 నిమిషాలపాటు కొనసాగనున్న ఈ సూర్యగ్రహణం యూరప్, ఉత్తర ఆఫ్రికా, మరియు మధ్య ప్రాచ్యంప్రాంతాల్లో సంభవిస్తుంది. గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్‌గా పిలవబడే ఈ ఖగోళ దృశ్యంలో, చంద్రుడు సూర్యుడుని పూర్తిగా కప్పివేస్తాడు. ఈ గ్రహణం పగటిపూట ఏర్పడటం వలన భూమండలం 6 నిమిషాల 23 సెకన్ల పాటు అంధకారంలో మునిగిపోతుంది. ఇది 123 సంవత్సరాలలో భూమిపై కనిపించే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణంగా…అరుదైన ఖగోళ సంఘటనగా నిలుస్తుంది. ఈ సూర్యగ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రారంభమై, తూర్పు దిశగా యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వైపు కదులుతుంది. గ్రహణం పూర్తి దృశ్యం 258 నుండి 275 కిలోమీటర్ల వెడల్పు గల సన్నని బ్యాండ్‌లో కనిపిస్తుంది. దక్షిణ స్పెయిన్‌లోని కాడిజ్, మలాగా వంటి నగరాల్లో 4 నిమిషాలకు పైగా చీకట్లు కమ్ముకుంటాయి. ఉత్తర మొరాకోలోని టాంజియర్, టెటౌవాన్, మరియు మధ్య ఈజిప్ట్‌లోని లక్సర్ సమీపంలో 6 నిమిషాలకు పైగా పూర్తి అంధకారం అలముకుంటుంది. నైరుతి సౌదీ అరేబియాలోని జెడ్డా, మక్కా, యెమెన్, మరియు ఈశాన్య సోమాలియా ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం భారత మహాసముద్రంలో ముగిసే ముందు చాగోస్ దీవులను దాటుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, మరియు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపించకపోవచ్చు. కొన్ని చోట్ల కేవలం పాక్షికంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రత్యేకత ఏంటంటే… ఈ సూర్యగ్రహణం భూమి సూర్యునికి దూరంగా ఉండే సమయంలో (అఫీలియన్) మరియు చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే సమయంలో (పెరిజీ) సంభవిస్తుంది. దీని వల్ల సూర్యుడు చిన్నగా, చంద్రుడు పెద్దగా కనిపించి, గ్రహణం యొక్క దీర్ఘకాలికతను పెంచుతుంది. దానికితోడు, ఈ గ్రహణం భూమధ్యరేఖ సమీపంలో జరుగుతుంది, ఇక్కడ చంద్రుని నీడ భూమిపై నెమ్మదిగా కదులుతుంది, దీనివల్ల గ్రహణ సమయం పెరుగుతుంది. ఈ గ్రహణం శాస్త్రవేత్తలకు సూర్యుని కరోనాను అధ్యయనం చేసే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mosquitoes: ఒక్క సెకనులో 30 దోమలను చంపే సూపర్ వెపన్
స్మృతి మంథాన పెళ్లికి బ్రేక్ పలాష్ మోసం చేశాడా ??
Delhi: పాన్ మసాలా కోటీశ్వరుడి ఇంట్లో విషాదం
Weather Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం… ఏపీలో అతి భారీ వర్షాలు
Andhra King Taluka Review: అక్కడ బిగిస్తే.. సినిమా మరోలా ఉండేదేమో..?
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

