AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquitoes: ఒక్క సెకనులో 30 దోమలను చంపే సూపర్‌ వెపన్‌

Mosquitoes: ఒక్క సెకనులో 30 దోమలను చంపే సూపర్‌ వెపన్‌

Phani CH
|

Updated on: Nov 28, 2025 | 1:03 PM

Share

ప్రపంచవ్యాప్తంగా దోమలు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక రోగాలకు కారణమవుతున్నాయి. రసాయనాలతో కూడిన ప్రస్తుత నివారణ పద్ధతులు ఆరోగ్యానికి హానికరం. ఈ సమస్యకు పరిష్కారంగా, ఫోటాన్ మాట్రిక్స్ ల్యాబ్ లేజర్ ఆధారిత 'ఫోటాన్ మాట్రిక్స్'ను పరిచయం చేస్తోంది. LiDAR టెక్నాలజీతో దోమలను గుర్తించి, తక్కువ శక్తి లేజర్‌లతో చంపే ఈ పరికరం, మానవులకు సురక్షితమైన, రసాయన రహిత దోమల నివారణను అందిస్తుంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనే కామన్‌ సమస్య దోమలు. కరోనాకైనా చెక్‌ పెట్టగలుగుతున్నాం కానీ.. ఈ దోమలను మాత్రం అడ్డుకోలేకపోతున్నాం. ఏ ఇంట్లో చూసినా దోమల బ్యాట్‌ తప్పనిసరిగా కనిపిస్తుంది. అంతెందుకు.. ఈ మధ్య అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్‌ కూర్చున్న టేబుల్‌ పక్కన కూడా దోమలను చంపే బ్యాట్‌ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఆ మధ్య బయటకు వచ్చింది. అంటే వైట్ హౌస్ ని కూడా దోమలు విడిచిపెట్టడం లేదంటే వీటి పవర్‌ ఏంటో అర్ధమవుతుంది. ఇంతటి పవర్‌ఫుల్‌ దోమలను అరికట్టాలంటే అంతకు మించిన పవర్‌ఫుల్‌ వెపన్‌ కావాల్సిందే. ఈ దోమల వల్ల ప్రాణాంతక డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చనిపోతున్నారు. కొన్ని కోట్లమంది ఈ దోమల వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయితే, ఈ దోమల నుంచి బయటపడేందుకు రకరకాల మార్గాలు, సొల్యూషన్స్ మార్కెట్లోకి చాలా కాలం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దోమతెరలు మొదలుకొని, మస్కిటో కాయిల్స్, దోమల బ్యాట్లు, స్ప్రే, తాజాగా లెమన్ గ్రాస్ ఇలా రకరకాల దోమల నివారణ మార్గాలు ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ ఎంతో కొంత ఆరోగ్యానికి హాని కలిగించే కెమికల్స్ ఉంటున్నాయి. దోమలను చంపే ఈ రకమైన మందుల వల్ల చాలామంది శ్వాసకోస వ్యాధులకు గురవుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి ఒక కొత్త దోమల నియంత్రణ మిషన్ రాబోతుంది. ఇది మార్కెట్లోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ దోమలనుంచి విముక్తి లభిస్తుందని భావిస్తున్నారు. ఫోటాన్ మాట్రిక్స్ ల్యాబ్ ఈ ఫోటాన్ మాట్రిక్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పూర్తిగా లేజర్ సాయంతో పని చేస్తుంది. లైడర్ టెక్నాలజీ తో ఇది దోమలను గుర్తిస్తుంది. దీనిని రూమ్ లో ఓ మూల ఫిక్స్ చేస్తే చాలు… ఆ చుట్టుపక్కల దోమలు ఎక్కడ దాక్కున్నా లైడర్ టెక్నాలజీ ద్వారా కేవలం 3 సెకండ్లలో గుర్తిస్తుంది. ఆ లోకేషన్ ని వెంటనే లాక్ చేస్తుంది. ఆ వెంటనే లేజర్ రిలీజ్ అయి ఆ దోమల్ని చంపేస్తాయి. ఇదంతా కనురెప్ప పాటులో జరిగిపోతుంది. అంటే ఒక్క సెకండ్లో 30 దోమల వరకు చంపేస్తుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవుంటుంది కంపెనీ. మనిషికి ఏమాత్రం హాని చేయని.. లో రెసొల్యూషన్ లేజర్ కిరణాల ద్వారా దోమల్ని చంపేస్తాం అంటుంది. ఈ ఫోటాన్ మ్యాట్రిక్స్ మార్కెట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఫ్రీ ఆర్డర్స్ మాత్రం కంపెనీ తీసుకుంటుంది. ఎవరైనా ముందుగానే ఈ లేజర్ గన్ తీసుకోవాలనుకుంటే కంపెనీ వెబ్‌సైట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్మృతి మంథాన పెళ్లికి బ్రేక్‌ పలాష్ మోసం చేశాడా ??

Delhi: పాన్‌ మసాలా కోటీశ్వరుడి ఇంట్లో విషాదం

Weather Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం… ఏపీలో అతి భారీ వర్షాలు

Andhra King Taluka Review: అక్కడ బిగిస్తే.. సినిమా మరోలా ఉండేదేమో..?

Published on: Nov 28, 2025 10:05 AM