AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కితే.. నెక్ట్స్‌ మినిట్‌లో ఏం చేయాలి ??

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కితే.. నెక్ట్స్‌ మినిట్‌లో ఏం చేయాలి ??

Phani CH
|

Updated on: Nov 27, 2025 | 5:11 PM

Share

ఎస్బీఐ ఆధార్ అప్‌డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి, మాలిషియస్ APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయమని నమ్మిస్తున్నారు. ఈ ఫైల్ ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయ్యి, బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఇలాంటి ఫిషింగ్ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. వెంటనే చర్యలు తీసుకోవాలి.

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త ఎత్తుగడతో మళ్లీ పంజా విసిరారు. ‘మీ ఆధార్‌ నెంబర్‌ ఈ రోజు అర్ధరాత్రి లోపు అప్‌డేట్‌ చేసుకోవాలి. లేదంటే మీ బ్యాంకు ఖాతా క్లోజ్‌ అవుతుంది. ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి వెంటనే ఎస్‌బీఐ ఆధార్‌ ఆప్‌డేట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి’ అని సూచిస్తూ హెచ్చరించారు. మరోవైపు వేలాది వాట్సాప్‌ గ్రూపుల్లోకి చొరబడి వాటి అడ్మిన్‌లను కంట్రోల్‌ తీసుకుని డీపీని ఎస్‌బీఐ చిహ్నం కింద మార్చివేశారు. జర్నలిస్టులు, మంత్రులు, ఆఖరికి సీఎంఓ వాట్సాప్‌ గ్రూపుల్లోకి సైతం సైబర్‌ నేరగాళ్లు చొరబడ్డారు. సైబర్‌ చీటర్స్‌ పంపించిన ఏపీకే ఫైలును తెరిచిన వెంటనే ఫోన్లు హ్యాంగ్‌ అయిపోతుండటం, బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు ఖాళీ అవుతుండటంతో వేలాది మంది సైబర్‌ క్రైం విభాగానికి ఫిర్యాదులు చేశారు. సీనియర్‌ సిటిజన్లు చాలామంది తమ వాట్సాప్‌ వచ్చిన బ్యాంక్‌ మెస్సేస్‌ నిజమని నమ్మి ఏపీకే ఫైళ్లను ఓపెన్‌ చేశారు. ఫోన్లు హ్యాక్‌ కావడంతో గందరగోళానికి గురయ్యారు. ఎస్‌బీఐ పేరిట వచ్చిన ఏపీకే ఫైల్‌ను పొరపాటున ఇన్‌స్టాల్‌ చేస్తే వెంటనే హ్యాకర్లు ఆ ఫోన్‌కు సంబంధించిన ఓటీపీలు, ఎస్‌ఎంఎస్‌లు, యూపీఐ పిన్‌లు తెలుసుకుంటారు. నిమిషాల వ్యవధిలో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు. హ్యాకింగ్‌కు గురైన వారి ఫోన్‌లోని కాంటాక్ట్స్‌లో పలువురికి వాట్సాప్‌ ద్వారా డబ్బు పంపాలని సందేశాలు పంపుతారు. లేదా వాట్సాప్‌ ద్వారా భయపెట్టే సందేశాలను పంపుతారు. స్క్రీన్‌‌ రికార్డింగ్‌ ఆటోమేటిక్‌గా ఆన్‌ అయిపోతుంది. యూపీఐ పేమెంట్‌ యాప్స్‌కు వారు లాగిన్‌ అయిపోతారు. సెల్‌ఫోన్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం హ్యాకర్లు ఎస్‌బీఐ పేరిట ఫిషింగ్‌ స్కామ్‌కు పాల్పడ్డారని, ఎస్‌బీఐ పేరిట వచ్చిన ఏ సందేశాన్ని ఓపెన్‌ చేయవద్దని అలర్ట్‌ సందేశాన్ని విడుదల చేశారు. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం బ్యాంకులు తమ వినియోగదారుల సెల్‌ఫోన్లకు ఎలాంటి సందేశాలు పంపించవని, దీన్ని అందరూ గమనించాలన్నారు. ఇలాంటి సందేశం వచ్చిన నెంబర్‌ను బ్లాక్‌ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చే సి ఉంటే వెంటనే ఆ ఫోన్‌ను ఏరోప్లేన్‌ మోడ్‌లో పెట్టాలని, మీ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను బ్లాక్‌ చేయించుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ