AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ

Phani CH
|

Updated on: Nov 27, 2025 | 3:49 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పుపై వివాదం మళ్ళీ రాజుకుంది. ఒక పెళ్లి శుభలేఖలో 'అంబేద్కర్' పేరును తొలగించి ముద్రించడంపై దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రింటర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పేరు గుర్తింపుపై గతంలోనూ ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయం, ప్రజల అభ్యంతరాలు, పోలీసుల హెచ్చరికలు ఈ వివాదానికి మూలం.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా పేరు మార్చి రాస్తున్నారంటూ కలెక్టర్‌కు అంబేద్కర్‌ వాదులు,దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఒక పెళ్లి శుభలేఖలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులుగా కోనసీమ జిల్లా అని ముద్రించటంపై దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పేరు మార్చి రాయడంపై తప్పు పడుతున్నారు. కొందరు ప్రింటర్లు అంబేద్కర్ పేరు వాడటం ఇష్టంలేకనే.. కేవలం కోనసీమ జిల్లా అని ప్రింటింగ్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో కొత్త జిల్లాగా మారింది. ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న దళిత జనాభా ఉండటంతో తమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అప్పట్లో దళిత సంఘాలు నాటి వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరుకు ప్రకటించింది. మొదట్లో అన్ని వర్గాలు దీనిని స్వాగతించినా.. నెమ్మదిగా అంబేద్కర్ పేరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. పేరు మార్పుని వ్యతిరేకిస్తూ గతంలో అమలాపురం వేదికగా భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. కోనసీమ పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమలాపురం జిల్లాను కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని, అంబేద్కర్‌కు తాము వ్యతిరేకం కాకున్నా తమను తాము కోనసీమ వాసులుగానే పిలుచుకోవడానికి తరతరాలుగా అలవాటు పడిపోయామని కనుక ఆ పేరే కొనసాగించాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే జిల్లా పేరులో అంబేద్కర్‌ పేరును తొలగించినా, ఆ పేరు లేకుండా జిల్లా పేరు ముద్రించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ తాజాగా ఓ పెళ్లి పత్రికలో అంబేద్కర్‌ పేరు లేకుండా జిల్లా పేరు ముద్రించడం మళ్లీ వివాదానికి కారణమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం

40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే

బిగ్‌ బాస్‌ సీరియస్ ఆ ముగ్గురికీ రెడ్ కార్డ్‌ ??

అందం కోసం పాకులాడితే.. అంద విహీనంగా తయారయ్యే