ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం
కర్నూలు జిల్లా నారాయణపురం గ్రామంలో వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ఇది. కార్తీక మాసం తర్వాత శ్రీ గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, కుల మతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేస్తారు. దీని వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ఎలాంటి కరువులు రావని వారి నమ్మకం. ఈ సామూహిక భోజనం గ్రామ ఐక్యతకు ప్రతీక.
కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఓ ఆచారం కొనసాగుతోంది. కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే సోమవారం ఆ గ్రామస్థులంతా స్థానిక ఆలయానికి చేరుకొని పూజలు చేస్తారు. అనంతరం సహపంక్తి భోజనాలను దేవాలయ ఆవరణంలోనే కుల మతాలకు అతీతంగా భోజనాన్ని ఆరగిస్తారు. దీనివల్ల గ్రామంలో ఎలాంటి సమస్యలు దరిచేరవని వారి నమ్మకం. కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామస్థులంతా తమ గ్రామం సుభిక్షంగా ఉండాలని శ్రీ గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి సహపంక్తి భోజనం చేశారు. వందల సంత్సరాల నుంచి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏడాది కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే సోమవారం గర్జలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. అనంతరం ప్రతి ఇంటిలో ఒక రోజుకు ఎంత వంట చేస్తారో అంత వంట వండి అత్యంత నిష్టతో అన్నం తెచ్చి దేవాలయంలో రాసిగా పోస్తారు. సాంబారు మాత్రమే గుడిలోనే వండుతామని తెలిపారు. పూజలు తర్వాత కుల, మత బేధాలు లేకుండా… సామూహిక భోజనం చేస్తామని వారు తెలిపారు. ప్రతి ఏడాది ఇలా పూజలు చేయడం వల్ల గ్రామంలో కరవు, కాటకాలు రావని దేవాలయ కమిటీ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే
బిగ్ బాస్ సీరియస్ ఆ ముగ్గురికీ రెడ్ కార్డ్ ??
అందం కోసం పాకులాడితే.. అంద విహీనంగా తయారయ్యే
స్మృతిని ఛీట్ చేసిన పలాష్ బయటపడ్డ ఎఫైర్! అందుకే పెళ్లి క్యాన్సిల్
Ram Gopal Varma: ‘నేను పైరసీలోనే సినిమాలు చూస్తా..’ టాలీవుడ్‌లో రచ్చ లేపుతున్న RGV స్టేట్‌మెంట్
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం
ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్

