40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే
ఐబొమ్మ రవి అరెస్ట్, వెబ్‌సైట్ మూసివేత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 100 కోట్లకు పైగా పైరసీ ద్వారా సంపాదించి, విలాసవంతమైన జీవితం గడిపిన రవి క్రిమినల్ నేపథ్యం, అతని నేర చరిత్ర, భార్యకు విడాకులు వంటి వ్యక్తిగత వివరాలు బయటపడ్డాయి. విదేశీ పర్యటనలు, లగ్జరీ హోటళ్లు అతని జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఈ పైరసీ కింగ్ వెనుక ఉన్న వాస్తవాలు విస్మయం కలిగించాయి.
తెలుగు స్టేట్స్‌లో వన్ వీక్ నుంచి టాప్ ట్రెండింగ్‌లో ఐబొమ్మ టాపిక్ నడుస్తోందీ.అరెస్ట్ అవడం, పైరసీ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయడం.. ఇదంతా ఒక వెర్షన్ మాత్రమే. మరో వెర్షన్‌పై పెద్ద డిస్కషనే జరుగుతోందిప్పుడు. ఇటు సినీ ప్రేక్షకులతోపాటు అటు సాధారణ ప్రజలూ తనవైపు చూసేలా చేసిన ఈ ఐబొమ్మ రవి హీరోనా? విలనా? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తేల్చారు. పెళ్లికి ముందు నుంచే అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టు గుర్తించారు. అమీర్‌పేట్‌లో ఉంటూ ప్రహ్లాద్ అనే తన స్నేహితుడి గుర్తింపు కార్డులను తీసుకొని అనేక నేరాలు చేసినట్లు గుర్తించారు. పెళ్లయిన తర్వాత కూడా రవి తన తీరు మార్చుకోలేదు. భార్యతో పాటు, తన కూతురిపై చేయి చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఈ కారణాలతోనే రవికి తన భార్య విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించారు పోలీసులు. తనను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు చివరి రోజు విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్‌పై ఆరాతీశారు పోలీసులు. ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు తేలింది. ప్రతీ 20 రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లొచ్చాడు రవి. అరెస్ట్‌కు ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్‌కి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటిదాకా 40 సార్లు ఫారెన్ ట్రిప్స్‌కి వెళ్లాడని.. ప్రతీచోటా లగ్జరీ హోటల్స్‌లో స్టే చేసినట్లు తేల్చారు. ఐబొమ్మ సైట్‌లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవి. పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్‌కు రవి.. ప్రతి నెలా రూ.50 వేలు ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది. మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి కావాల్సిన మసాలా దినుసులన్నీ రవి జీవితంలో ఉన్నాయి. ఐబొమ్మతో రవి ఒక్కడే ఈ మొత్తం పైరసీ చేసినట్టు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లల్లో 100 కోట్ల రూపాయలు వరకు సంపాదించినట్టు తేల్చారు. 20 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్ సీరియస్ ఆ ముగ్గురికీ రెడ్ కార్డ్ ??
అందం కోసం పాకులాడితే.. అంద విహీనంగా తయారయ్యే
స్మృతిని ఛీట్ చేసిన పలాష్ బయటపడ్డ ఎఫైర్! అందుకే పెళ్లి క్యాన్సిల్
Ram Gopal Varma: ‘నేను పైరసీలోనే సినిమాలు చూస్తా..’ టాలీవుడ్‌లో రచ్చ లేపుతున్న RGV స్టేట్‌మెంట్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

