AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందం కోసం పాకులాడితే.. అంద విహీనంగా తయారయ్యే

అందం కోసం పాకులాడితే.. అంద విహీనంగా తయారయ్యే

Phani CH
|

Updated on: Nov 27, 2025 | 2:50 PM

Share

నటి ఉర్ఫీ జావేద్ తన లిప్ ఫిల్లర్స్ అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం అందం కోసం చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీ బెడిసికొట్టిందని, దాని వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ప్రస్తుతం పెదవులు నార్మల్ స్థితికి వచ్చాయని, ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు ఆలోచించాలని ఆమె సూచించారు. ఇది అందం కోసం పాకులాడే వారికి ఓ హెచ్చరిక.

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇందులో కొంతమంది ఫిట్ నెస్ కోసం, అందం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అందానికి మెరుగులు దిద్దుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ సర్జరీలు బెడిసికొడుతుంటాయి. అందం కోసం పాకులాడడం కాదు కదా.. అంద విహానంగా మారుస్తాయి. స్టార్ మోడల్.. కమ్ సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్‌ ఊర్ఫీ జావేద్ విషయంలో కూడా ఓ సారి ఇలానే జరిగింది. అందం కోసం పాకులాడిన ఈమెకి.. రీసెంట్‌గా జరిగిన ఓ కాస్మోటిక్ సర్జరీ పెద్ద దెబ్బేసింది. రకరకాల మోడ్రన్ డ్రెస్సులతో బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయ్యే ఉర్ఫీ.. మొదట్లో టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న అందరూ హీరోయిన్ల లాగే మరింత అందం కోసం కాస్మోటిక్ సర్జరీల వెంట పరిగెత్తింది ఉర్ఫీ. అయితే రీసెంట్‌గా తన ఇన్‌స్టా హ్యాండిల్లో తన గత తాలూకు కాస్మోటిక్ సర్జరీ గురించి అందరికీ వివరించింది ఈ బ్యూటీ. దాదాపు 9ఏళ్ల క్రితం ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ ట్రై చేశా.. ఇన్నాళ్లకు నా పెదవులు నార్మల్ గా మారాయి. లిప్ ఫిల్లర్స్ ను ట్రై చేసి తప్పు చేశా.. నా రూపం చూసి నేనే నవ్వుకున్నా.. అలాగే ఎంతో బాధపడ్డా.. ఇన్నాళ్లకు లిప్ ఫిల్లర్స్ ను కరిగించుకున్నా అంటూ తాను పోస్టు చేసిన లేటెస్ట్ వీడియోలో చెప్పింది ఉర్ఫీ . అంతేకాదు లిప్ ఫిల్లర్ చేయించుకున్న తర్వాత వీడియోను కూడా షేర్ చేసింది. అయితే అందులో తన పెదాలు.. చెంపలు ఉబ్బి వాపుతో.. కనిపించడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్మృతిని ఛీట్ చేసిన పలాష్ బయటపడ్డ ఎఫైర్! అందుకే పెళ్లి క్యాన్సిల్‌

Ram Gopal Varma: ‘నేను పైరసీలోనే సినిమాలు చూస్తా..’ టాలీవుడ్‌లో రచ్చ లేపుతున్న RGV స్టేట్‌మెంట్

Vishal: దివాళా తీసాశా ?? విశాల్‌ పై కోర్టు ఆగ్రహం