AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి

Phani CH
|

Updated on: Nov 26, 2025 | 5:00 PM

Share

వివాహ బహుమతులపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ, అధిక విలువ గల గిఫ్ట్‌లకు ఆధారాలు అవసరం. రూ. 50,000కు మించిన బహుమతులపై పన్ను చెల్లించాలి, కానీ పెళ్లి బహుమతులకు ఈ నిబంధన వర్తించదు. బంధువుల నుండి అందుకున్న బహుమతులపై పన్ను ఉండదు. ఐటీ సమస్యలు రాకుండా, ఖరీదైన గిఫ్ట్‌లు అందుకున్నప్పుడు ఫోటోలు తీసుకోవడం, రసీదులు భద్రపరచడం మంచిది.

మన దేశంలో చాలా మంది పెళ్లిలో వధూవరులకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. మరీ దగ్గరి వారైతే ఖరీదైన బహుమతులు ఇస్తారు. అయితే ఇలా ఖరీదైన బహుమతులు ఇచ్చే సమయంలో కచ్చితంగా ఫొటో దిగడం మర్చిపోకండి. లేదంటే ఆ నూతన దంపతులను మీరే ఇబ్బందుల్లోకి నెట్టిన వారవుతారు. ఎందుకలా అనుకుంటున్నారా? మన దేశంలో వివాహ బహుమతులపై పన్ను ఉండదు. అయితే కొన్నిసార్లు ఖరీదైన బహుమతులు ఇచ్చినా, తీసుకున్నా మనం దానికి సంబంధించిన రుజువును అందించాల్సి ఉంటుంది. సాధారణంగా మీరు ఎవరి నుండి అయినా రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు అందుకుంటే, మీరు వాటిపై పూర్తి పన్ను చెల్లించాలి. అయితే వివాహ బహుమతులపై అలాంటి పరిమితులు లేవు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సహోద్యోగులు లేదా దూరపు బంధువులు వధూవరులకు ఇచ్చే బహుమతులపై ఎటువంటి పన్ను విధించబడదు. నిబంధనల ప్రకారం.. వివాహ సమయంలో బంధువులు ఇచ్చే బహుమతులకు కూడా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వివాహం సమయంలో ఇచ్చే బహుమతులు ఒకే తేదీన ఇవ్వాలనే నిబంధన లేదు. వివాహం జరిగిన 15 రోజులలోపు ఇచ్చే బహుమతుల కూడా ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందని కోర్టు తెలిపింది. అదేవిధంగా వివాహానికి 15 రోజుల ముందు ఇచ్చే బహుమతులు కూడా వివాహ బహుమతులుగా పరిగణిస్తారు. అయితే మీ వివాహానికి మీరు ఏ బహుమతిని అందుకున్నా ఆదాయపు పన్ను శాఖ దానిని కేవలం నోటి మాటగా చెబితే అస్సలు నమ్మదు. ఎందుకంటే మీ వివాహానికి పెద్ద బహుమతులకు సంబంధించిన ఆధారాలను మీరు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే ఎవరైనా ఖరీదైన బహుమతులు ఇస్తే తప్పకుండా ఫోటో దిగడం మంచిది. లేదంటే ఆనక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం.. వివాహ బహుమతితో పాటు ఇచ్చిన అభినందన సందేశం. పెళ్లిలో బహుమతులు అందుకున్నట్లున్న ఫోటోలు. గిఫ్ట్‌గా ఇచ్చిన వస్తువు గురించి బహుమతి ఇచ్చిన వ్యక్తితో సంభాషణ. మీ వివాహానికి ఇచ్చినట్లు మీరు చెప్పుకునే బహుమతులు వాస్తవానికి మీ వివాహంలోనే ఇచ్చారా లేదా అని ధృవీకరించడానికి ఆదాయపు పన్ను శాఖకు పై వివరాలను సమర్పించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూల్‌డ్రింక్‌పై ఇష్టంతో అతనేం చేశాడో చూడండి !!

వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీసులకే మస్కా కొట్టి జంప్‌

100 కోట్ల సంపాదనతో.. అత్యంత లగ్జరీగా బతికిన ఐ -బొమ్మ రవి

నల్లమలలో జంగిల్‌ సఫారీ.. ఎదురుగా పెద్దపులి.. కట్ చేస్తే

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్ష కొలువుల భర్తీకి రంగం సిద్ధం