కూల్‌డ్రింక్‌పై ఇష్టంతో అతనేం చేశాడో చూడండి !!
తమిళనాడు కారైకుడికి చెందిన మహదేవన్, కోకా-కోలాపై తనకున్న దశాబ్దాల ప్రేమను అద్భుతమైన వింటేజ్ మ్యూజియంగా మార్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్‌గా మారడంతో ఈ మ్యూజియం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కోక్ థీమ్ కారు, పాతకాలపు రేడియోలు, అరుదైన బాటిళ్లు వంటి వస్తువులతో ఈ సేకరణ సందర్శకులను ఆకట్టుకుంటోంది. కోక్ తనకు కలిగించిన ఉపశమనం నుండే ఈ అభిరుచి ప్రారంభమైందని మహదేవన్ వివరించారు.
తమిళనాడులోని కారైకుడికి చెందిన మహదేవన్‌కి కోకా-కోలా అంటే ఎంతో ఇష్టం. దానిపై అతనికున్న దశాబ్దాల నాటి ప్రేమను ఆయన ఒక అరుదైన వింటేజ్ మ్యూజియంగా మార్చారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ మ్యూజియం వీడియోను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మ్యూజియం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియంలో కోకా-కోలాపై ఉన్న ప్రేమతో మహదేవన్ సేకరించిన అనేక వస్తువులు పొందిపరిచారు. కోకా-కోలా థీమ్‌తో రూపొందించిన కారు, పాతకాలం నాటి ఫ్యాన్లు, రేడియో సెట్లు, వింటేజ్ వాటర్ బాటిళ్లు, కుర్చీలు, అరుదైన కళాఖండాలు, లిమిటెడ్ ఎడిషన్ బాటిళ్లు వంటివి ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఎంతో ఓపికతో ఆయన ఈ వస్తువులను సేకరించారు. ఈ మ్యూజియం సందర్శకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. తన అభిరుచి వెనుక ఉన్న కారణాన్ని మహదేవన్ వివరిస్తూ.. ఒకసారి తిరుప్పూర్‌లో తీవ్రమైన ఆకలి, తలనొప్పితో నీరసంగా ఉన్నప్పుడు ఒక కోక్ తాగాను. వెంటనే ఉపశమనం లభించింది. అప్పటి నుంచే ఈ సేకరణ మొదలుపెట్టాను. ఎక్కడికి వెళ్లినా మొదట కోక్ కొంటాను. ఇది చిన్నపిల్లల చేష్టలా అనిపించవచ్చు, కానీ అందులోనే నాకు దైవం కనిపిస్తుంది. గుడికి వెళితే ఎలాంటి సంతృప్తి కలుగుతుందో, నా సేకరణలోని వస్తువులను చూసినప్పుడు నాకు అలాంటి ఆనందమే కలుగుతుంది అని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు మహదేవన్ అభిరుచిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీసులకే మస్కా కొట్టి జంప్
100 కోట్ల సంపాదనతో.. అత్యంత లగ్జరీగా బతికిన ఐ -బొమ్మ రవి
నల్లమలలో జంగిల్ సఫారీ.. ఎదురుగా పెద్దపులి.. కట్ చేస్తే
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్ష కొలువుల భర్తీకి రంగం సిద్ధం
మానవ బంధాలన్నీ.. ఆర్ధిక సంబంధాలే.. సోదరి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి మరీ..
ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు

