AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. కట్‌చేస్తే.. అంత బట్టబయలు

రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. కట్‌చేస్తే.. అంత బట్టబయలు

Phani CH
|

Updated on: Nov 28, 2025 | 1:18 PM

Share

గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ, ఆసుపత్రిలోని పారిశుధ్యం, వైద్యుల లభ్యత, సిబ్బంది తీరుపై వస్తున్న ఆరోపణలను స్వయంగా పరిశీలించేందుకు మారువేషంలో తనిఖీ చేశారు. రాత్రివేళల్లో ఆసుపత్రి సేవల్లో లోపాలు, రోగులతో సిబ్బంది దురుసు ప్రవర్తన, వార్డుల్లో కుక్కల సంచారం వంటి పలు సమస్యలను గుర్తించారు. ఈ లోపాలపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు.

గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ అతి పెద్ద రిఫరల్ ఆసుపత్రిగా ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉండే ఈ ఆసుపత్రిలో రెండు వేల బెడ్స్ ఉంటాయి. ప్రతి రోజూ మూడు వేల మంది అవుట్ పేషెంట్స్‌ జిజిహెచ్ కు వస్తుంటారు. ముప్పైకి పైగా విభాగాల్లో స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో రోగులకు అన్ని సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే పెద్ద ప్రయత్నమే చేయాలి. గత కొంతకాలంగా ఆసుపత్రిలో పారిశుద్య లోపం ఉందని, వైద్యులు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదని, అత్యవసర విభాగాల వద్ద ఉద్యోగుల వ్యవహార శైలి గందరగోళంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పది గంటల నుండి తెల్లవారే వరకూ అందుతున్న సేవలపై రోగుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలోనే సూపరింటెండెంట్ గా యశస్వి రమణ ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి, లోపాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకున్నారు. ఆస్సత్రి సూపరింటెండెంట్‌గా సాధారణ తనిఖీలు చేస్తే ఉద్యోగులు, వైద్యులు ముందే అలెర్ట్ అవుతారని భావించిన సూపరింటిండెంట్ రమణ…. మారు వేషంలో ఆస్పత్రికి వెళ్లారు.రాత్రి పది గంటల సమయంలో వ్రుద్దుడి వేషంలో ఇద్దరూ సహాయకులతో ఎమర్జెన్సీ విభాగానికి వచ్చారు. అక్కడ నుండి వివిధ వార్డుల చుట్టూ తిరుగుతూ వైద్యులు, సిబ్బంది పనితీరును గమనించారు. వార్డుల్లోకి కుక్కలు వస్తుండటాన్ని ప్రత్యక్షంగాచూశారు. రాత్రి సమయంలో వచ్చే రోగులతో సిబ్బంది మాట్లాడుతున్న వ్యవహారశైలిని గమనించారు. దాదాపు రెండు గంటల పాటు మారువేషంలోనే ఆసుపత్రి మొత్తం కలియదిరిగారు. కొందరు సిబ్బంది ఆయన ఎవరు..ఎందుకొచ్చారంటూ దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. అయితే, ఆయన ఏం సమాధానం చెప్పకుండా ఆసుపత్రికి ఎలా వచ్చారో అలానే వెళ్లిపోయారు. తనిఖీల్లో భాగంగా సూపరింటిండెంట్‌ పలు లోపాలను గుర్తించినట్లు తెలిసింది. వాటిల్లో మార్పు తెచ్చేందుకు సూపరింటిండెంట్ సిద్ధమైనట్టు సమారాచం. రాత్రి ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడుని గుర్తించని సిబ్బంది కొందరు దురుసుగా కూడా ప్రవర్తించినట్లు తెలిసింది. మర్నాడు ఉదయం రాత్రి వచ్చిన వృద్ధుడు ఆస్పత్రి సూపరింటిండెంట్‌ అని తెలియడంతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎస్వీ యూనివర్శిటీలో చిరుత ప్రత్యక్షం.. భయాందోళనలో విద్యార్ధులు

ఓటుకు నోటు వద్దే వద్దు.. కోతులను తరిమితే చాలు కొత్త సర్పంచ్‌ మీరే

123 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. 6 నిమిషాల పాటు పూర్తిగా చీకటి

Mosquitoes: ఒక్క సెకనులో 30 దోమలను చంపే సూపర్‌ వెపన్‌

స్మృతి మంథాన పెళ్లికి బ్రేక్‌ పలాష్ మోసం చేశాడా ??