Holi Crime: పండుగ పేరుతో పైశాచికం.. బ్లేడుతో గాట్లు.. రక్తం వస్తున్నా వదలకుండా

పండుగ పేరుతో కొందరు యువకులు పైశాచింకగా ప్రవర్తిస్తున్నారు. రంగులు పూసుకని, ఆనందంగా జరుపుకోవాల్సిన హోలీ పండుగను విషాద(Tragedy) పండుగగా మారుస్తున్నారు. ఈ పండుగకు రంగులు పూసుకోవడమే కాకుండా...

Holi Crime: పండుగ పేరుతో పైశాచికం.. బ్లేడుతో గాట్లు.. రక్తం వస్తున్నా వదలకుండా
Blade Batch
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: Mar 19, 2022 | 5:51 PM

పండుగ పేరుతో కొందరు యువకులు పైశాచింకగా ప్రవర్తిస్తున్నారు. రంగులు పూసుకని, ఆనందంగా జరుపుకోవాల్సిన హోలీ పండుగను విషాద(Tragedy) పండుగగా మారుస్తున్నారు. ఈ పండుగకు రంగులు పూసుకోవడమే కాకుండా టమాటాలు(Tomato), గుడ్లు (Eggs) కొట్టటం ప్రారంభించారు. అక్కడితోనూ ఆగకుండా మురికి కాలువల్లో పడేయటం, పేడ నీళ్లు కొట్టటం ఇలా వాళ్లలో ఉన్న క్రూరత్వం బయటపెడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌ – 2 లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వెనకాల ఉండే ఇందిరానగర్​లో శ్రీహరి నివాసముంటున్నాడు. అతను స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. హోలీ పర్వదినం సందర్భంగా.. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీహరి హోలీ ఆడాడు. శ్రీహరి ఇంటికి సమీపంలోనే నివసించే అభి, నాని, బబ్లూ అనే ముగ్గురు స్నేహితులు వచ్చి శ్రీహరి ఒంటి నిండా రంగులు పూశారు. ఆ తర్వాత తలపై కోడిగుడ్లు కొట్టారు. అయినా వాళ్లు శ్రీహరిని వదలలేదు. ఇదే సమయంలో తమతో తెచ్చుకున్న బ్లేడ్‌ తీసి.. శ్రీహరి వీపు, తొడలపై గాట్లు పెట్టారు. రక్తస్రావం జరగడం, నొప్పితో బాధితుడు కేకలు వేయడంతో గమనించిన శ్రీహరి తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అనంతరం బంజారాహిల్స్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరో ఘటనలో.. తెలంగాణలోని నిజామాబాద్​జిల్లా బోధన్​మండలంలోని హున్సా గ్రామంలో హోలీ రోజున వింత ఆచారం జరుగుతుంది. గత 300 ఏళ్లుగా ఈ గ్రామంలో హొలీ రోజున సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమ ఆచారంలో భాగంగానే ఈరోజు ఉదయమంతా రంగులు చల్లుకుని, రాత్రి సమయలో కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఊరి మధ్యలోని ఆంజనేయస్వామి గుడి ముందుకు ఊరేగింపుగా అంతా చేరుకున్ని అక్కడే ఉన్న స్తంభాలకు బలంగా ఓ తాడుకడతారు. ఇరువైపులా ఉన్న జనం వర్గాలుగా విడిపోయి కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అనంతరం ఊరేగింపుగా.. గ్రామం నలుమూలల నుంచి పురుషులంతా పిడిగుద్దులు కొట్టుకున్నారు.

Also Read

Exams: పేపర్‌ కొరత కారణంగా పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తీవ్రరూపం దాల్చుతోన్న ఆర్థిక సంక్షోభం..

Mozilla Firefox: ఫైర్‌ఫాక్స్‌ యూజర్లను అలర్ట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.. వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. లేదంటే..

RRR Movie: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు తెలంగాణ సర్కారు భారీ నజరానా..