Exams: పేపర్‌ కొరత కారణంగా పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తీవ్రరూపం దాల్చుతోన్న ఆర్థిక సంక్షోభం..

Exams: శ్రీలంకలో (Srilanka) ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. నిధుల కొరతతో దేశం ఆర్థికంగా పూర్తిగా పతన స్థితికి చేరుకుంది. ఇప్పటికే దేశ అవసరాలకు సరిపడ ఇంధనం దిగుమతి చేసుకోలేక శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. గతంలో ఎన్నడూ కనివీని ఎరగని ఆర్థిక సంక్షోభం..

Exams: పేపర్‌ కొరత కారణంగా పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తీవ్రరూపం దాల్చుతోన్న ఆర్థిక సంక్షోభం..
Sri Lanka Exams
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 19, 2022 | 4:04 PM

Exams: శ్రీలంకలో (Srilanka) ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. నిధుల కొరతతో దేశం ఆర్థికంగా పూర్తిగా పతన స్థితికి చేరుకుంది. ఇప్పటికే దేశ అవసరాలకు సరిపడ ఇంధనం దిగుమతి చేసుకోలేక శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. గతంలో ఎన్నడూ కనివీని ఎరగని ఆర్థిక సంక్షోభం శ్రీలంకను (sri lanka financial crisis) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశంలో విద్యుత్‌ కోతలు కూడా విధించే స్థాయికి పరిస్థితి చేరకుంది. కరోనా తర్వాత పరిణామాల నేపథ్యంలో శ్రీలంకలో టూరిజం పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థిక కష్టాలు మొదలై ఇప్పుడు అవి పీక్స్‌కి వెళ్లిపోయాయి. భారత్‌ తాజాగా శ్రీలంకు ఆర్థిక సాయాన్ని అందించినా అప్పుల నుంచి గట్టెక్కలేక పోతోంది.

ఇదిలా ఉంటే శ్రీలంకలో తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటన ఆ దేశ ఆర్థిక స్థితి ఎంతలా దిగజారిందో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. దిగుమతులు చేసుకోలేని దుస్థితికి చేరుకోవడంతో కొలంబలో పేపర్‌ నిల్వలు అయిపోయాయి. దీంతో ప్రభుత్వం కనీసం విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. దీంతో సోమవారం నుంచి జరగాల్సి టర్మ్‌ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నా పత్రాల తయారీకి సరిపడ పేపర్‌, ఇంక్‌ను దిగుమతి చేసుకోవడానికి సరిపడ విదేశీ మారకద్రవ్యం లేని కారణంగా పరీక్షలను నిర్వహించలేకపోతున్నామని అధికారులు తెలిపారు.

ఈ నిర్ణయంతో దేశంలోని మొత్తం 45 లక్షల విద్యార్థుల్లో 30 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. ఇక దిగుమతులకు సరిపడ విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో శ్రీలంక ఆహారం, ఇంధనం, ఔషధాల దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. దీంతో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Andhra Pradesh: నాటుసారా, కల్తీమద్యంపై టీడీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..

Sarkaru Vaari Paata: తండ్రితో కలిసి స్టెప్పులేసిన సితార.. ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ ప్రోమో అదుర్స్

Road Accident: ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం..