Heartland Virus: కలవరపెడుతోన్న కొత్త వైరస్‌.. నల్లుల నుంచి వేగంగా వ్యాప్తి.. వారికే ముప్పంటున్న వైద్య నిపుణులు..

America: కరోనా వైరస్‌ (Coronavirus) ఇంకా మన చుట్టూ తిరుగుతూనే ఉంది. 2019 డిసెంబర్‌ నుంచి ప్రపంచాన్ని పీడిస్తోన్న ఈ మహమ్మారి ఇప్పటికే మూడు దఫాలుగా మూడు చెరువుల నీళ్లు తాగించింది.

Heartland Virus: కలవరపెడుతోన్న కొత్త వైరస్‌.. నల్లుల నుంచి వేగంగా వ్యాప్తి.. వారికే ముప్పంటున్న వైద్య నిపుణులు..
Basha Shek

|

Mar 19, 2022 | 4:25 PM

America: కరోనా వైరస్‌ (Coronavirus) ఇంకా మన చుట్టూ తిరుగుతూనే ఉంది. 2019 డిసెంబర్‌ నుంచి ప్రపంచాన్ని పీడిస్తోన్న ఈ మహమ్మారి ఇప్పటికే మూడు దఫాలుగా మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఎంతోమందిని బలితీసుకుని మరెంతో మందిని రోడ్డున పడేసింది. ఇక మన దేశంలో మూడో వేవ్‌ (Third Wave) ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో అందరూ ప్రశాంతంగా రిలాక్స్‌ అవుతున్నారు. అయితే కరోనాకు పుట్టినిల్లైన చైనాలో చైనాతో పాటు యూరప్‌ దేశాల్లో వైరస్‌ మళ్లీ చెలరేగుతోంది. దీంతో మళ్లీ నాలుగో వేవ్‌ (Fourth Wave) ఊహాగానాలు ఊపందుకున్నాయి. మనదేశంలోనూ వైరస్‌ విజృంభించవచ్చని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇదిలా మరో కొత్త వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాను వణిస్తోంది. నల్లుల నుంచి వ్యాప్తి చెందే ఈ వైరస్‌ పేరు హార్ట్‌లాండ్‌ (Heartland Virus) . తాజాగా అమెరికాలోని జార్జియలో మొదటి వైరస్ కేసు వెలుగుచూసింది. దీంతో జార్జియా ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. జార్జియాతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో కూడా హార్ట్‌లాండ్ కేసులు నమోదవుతుండడంతో అమెరికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మందు కూడా లేదు.. కాగా హార్ట్‌ల్యాండ్ వైరస్‌ గురించి పూర్తి వివరాలు కనుగొనే పనిలో పడ్డారు వైద్యాధికారులు. ఈవైరస్‌ సోకిన వారిలో పలు అవయవాలు దెబ్బతింటాయని, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాగా వైద్యుల అభిప్రాయం ప్రకారం… హార్ట్‌ల్యాండ్ వైరస్‌ని మొదట తెల్లతోక ఉండే జింకల్లో మాత్రమే గురించారు. అయితే ఇప్పుడది నల్లుల్లో కూడా ఉన్నట్లు, మనుషులకు కూడా సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక హార్ట్‌లాండ్ మొదటి కేసు 2009లో అమెరికాలోని మిస్సోరిలో వెలుగు చూసింది. ఇప్పటివరకు మొత్తం 50 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఈవైరస్‌ వల్ల మరణాల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రంముప్పు ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో మృత్యువు అంచుల దాకా వెళ్లిపోవచ్చంటున్నారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, కీళ్లనొప్పులు, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, డయేరియా, నీరసం ఈ వైరస్‌ లక్షణాలు. మరో దురదృష్టకరమైన విషయమేమిటంటే.. ఈ వైరస్‌కు ఎలాంటి ఔషధం, వ్యాక్సినూ లేదు. దీంతో అమెరికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Also Read:Holi Crime: పండుగ పేరుతో పైశాచికం.. బ్లేడుతో గాట్లు.. రక్తం వస్తున్నా వదలకుండా

గాడిదలు లేకపోతే ఆ ఊర్లు చరిత్రలో ఉండవ్.. దావాఖానాకు అవే.. దాహానికి అవే.. ఎక్కడో తెలుసా!

UP MLC Elections: యూపీలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. 30 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu