Heart Touching Story: రోజూ సముద్ర తీరం దగ్గరకు కుక్క.. తన యజమాని వస్తాడనే ఆశతో గతకొన్నేళ్లుగా.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్

Heart Touching Story: కుక్క, పిల్లి, పిచ్చుక, పావురం, కుందేలు, ఆవులు ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు జంతు ప్రేమికులు మక్కువు చూపుతుంటారు. కొన్ని జంతువులు మనం వాటిని ఎలా ప్రేమిస్తున్నామో..

Heart Touching Story: రోజూ సముద్ర తీరం దగ్గరకు కుక్క.. తన యజమాని వస్తాడనే ఆశతో గతకొన్నేళ్లుగా.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
Dog Waits For His Dead Fish
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2022 | 4:01 PM

Heart Touching Story: కుక్క, పిల్లి, పిచ్చుక, పావురం, కుందేలు, ఆవులు ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు జంతు ప్రేమికులు మక్కువు చూపుతుంటారు. కొన్ని జంతువులు మనం వాటిని ఎలా ప్రేమిస్తున్నామో.. అదే విధంగా అవి కూడా మనల్ని ప్రేమిస్తాయి. యజమాని పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తాయి. అయితే మిగిలిన అన్ని జంతువుల్లోకి భిన్నం కుక్క.. అత్యంత విశ్వాసంగల జంతువు. ఒక మంచి మిత్రుని లా ఉంటుంది.  తమకు అన్నం పెట్టిన వారి రక్షణ కోసం నిలబడుతుంది. అవసరమైతే తన ప్రాణాలు సైతం అర్పిస్తోంది. అందుకనే ఎక్కువుగా మనుసులు కుక్కలను పెంచుకుంటారు. తమ  కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమను చూపిస్తారు. తాజాగా హృదయాన్ని హత్తుకునే ఓ కుక్క కథ ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. కుక్క సముద్రంలో వేటకు వెళ్లిన తన యజమాని అయిన జాలరి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ.. ప్రతిరోజూ బీచ్‌కి వెళ్తుంది. వాగిటో అనే ఈ కుక్క కథను ఒక పెరువియన్ మహిళ( Peruvian woman) సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేసింది.

పెరూలోని పుంటా నెగ్రా తీరంలో తాను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సముద్రం వైపు ఆర్తిగా తదేకంగా చూస్తున్న కుక్క గురించి పెరువియన్ మహిళ వివరాయించింది. నెగ్రాకు చెందిన ఓ జాలరి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళాడు. అయితే అతను వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు మరణించాడు. అయితే అతని పెంపుడు కుక్క ‘వాగిటో’ సముద్రంలోకి వెళ్లిన తన యజమాని తిరిగి వస్తాడని.. రోజు ఆ సముద్ర తీరంలో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ విషయం తాను గమనించి స్థానికులను ఆ కుక్క గురించి అడిగినట్లు జోలీ మెజియా అనే పెరువియన్ మహిళ చెప్పింది.

నడుచుకుంటూ వెళుతుండగా వాగిటోను చూసింది. ఆ శునకం బాధలో ఉన్నట్లు, చాలా రోజులుగా తిండి లేకుండా ఏడుస్తున్నట్లు గమనించింది. అది సముద్రం వైపు ఎందుకు చూస్తుంది? ఎవరి రాకకోసం ఎదురుచూస్తుంది? అని తెలుసుకునే ప్రయత్నం చేసింది.

వాగిటో కు కుక్క యజమానికి మంచి బంధంఉంది. రోజూ ఆ జాలరి తాను ఎక్కడికి వెళ్లినా ప్రతి చోటకు తన పెంపుడు కుక్కను తీసుకుని వెళ్ళేవాడు. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు మత్య్సకారుడు తాను సముద్రంలోకి వేటకు వెళ్తూ.. కుక్కను సముద్రం వద్దకు తీసుకుని వెళ్ళాడు.. అప్పుడు కుక్క తన యజమానికి వీడ్కోలు చెప్పింది. అయితే అతను మరణించినందున తిరిగి రాలేదు. అయినప్పటికీ సముద్రంలోకి వెళ్లేముందు యజమానికి బై చెప్పిన శునకం.. అతను ఎప్పటికైనా వస్తాడనే ఆశతో ప్రతిరోజూ ఉదయం సముద్రం వద్దకు చేరుకుంది. సాయంత్రం వరకూ ఎదురుచూస్తుంది. ఈ కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ కథ.. నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది.

జాలరి మరణించడంతో ఒంటరైపోయిన ఆ కుక్కను జోలీ మెజియా చేరదీసింది. ఎంతో ప్రేమగా చూస్తుంది. అయినప్పటికీ ప్రతిరోజూ వాగిటో సముద్ర తీరానికి వచ్చి కొన్ని గంటలపాటు తన యజమాని తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంటుంది.  వాగిటో గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు కుక్క సముద్రంలోకి ఆత్రుతగా చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read:

UP MLC Elections: యూపీలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. 30 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

Thumbura Theertham: ప్రకృతి అందాల నడుమ తుంబుర తీర్ధం.. రెండేళ్ల తర్వాత అనుమతి.. భారీగా పోటెత్తిన భక్తులు

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..