Andhra Pradesh: నాటుసారా, కల్తీమద్యంపై టీడీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..
ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా, కల్తీ మద్యం నిషేధించాలనే డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ (TDP) ఆందోళనలకు దిగింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైన్ షాపుల వద్ద నిరసనలు చేపట్టారు
TDP Protests: ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా, కల్తీ మద్యం నిషేధించాలనే డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ (TDP) ఆందోళనలకు దిగింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైన్ షాపుల వద్ద నిరసనలు చేపట్టారు. కల్తీ మద్యం బాటిళ్లను చూపుతూ ప్రభుత్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా విజయవాడ(Vijayawada) లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (MLA RamMohan) ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు టీడీపీ శ్రేణులు కల్తీ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తమ నిరసననను తెలియజేశారు. ఈ ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ పేద వారి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది..పేదోళ్ల ప్రాణాలకు విలువలేదు’ అంటూ ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి టీడీపీ శ్రేణులు.
కృష్ణా జిల్లా నందిగామలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆందోళకు దిగారు. ఈ సందర్భంగా మద్యం సీసాలు ధ్వంసం చేసి తమ నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో తొమ్మిది రకాలుగా నాసిరకం మద్యం అమ్మకాలు తీసుకొచ్చారని వారు రోడ్డుపై భైఠాయించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పాత గుంటూరు ఎన్టీఆర్ కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆందోళనకు దిగారు. నాటుసారా, జె బ్రాండ్ మద్యం అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. తూగో జిల్లా మోరంపూడి జంక్షన్ వద్ద ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వీఎల్ పురం వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నాలుగు రోజుల్లో మొత్తం 18 మంది ఒకే తరహా లక్షణాలతో మృతి చెందారు.
Andhra Pradesh | Women & youth workers of TDP hold protest in Vijayawada against ruling YSRCP government regarding the rise of illicit liquor in the state pic.twitter.com/v3oq9SUUok
— ANI (@ANI) March 19, 2022
Also Read:Fuel Prices: ఏపీలో అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి తెలుసా.. పూర్తి వివరాలు..
AP: పవన్ తలతిక్కగా మాట్లాడారు అంటూ నారాయణ కామెంట్.. మీ ఓట్ల లెక్కలు తెలుసుకోండి అంటూ జనసేన కౌంటర్
Amit Shah: జమ్ముకశ్మీర్‌లో భద్రతపై అమిత్ షా ఫోకస్.. టెర్రరిస్టులకు చెక్ పెట్టేందుకు..