మద్యం నింపిన కొబ్బరి బోండాలతో పబ్‌కు.. గచ్చిబౌలి యాక్సిడెంట్‌కు సంబంధించి నిర్ఘాంతపోయే విషయాలు
హైదరాబాద్ గచ్చిబౌలి కారు బీభత్సం కేసులో పోలీసుల అనుమానాలే నిజమయ్యాయి. మద్యం మత్తులోనే కారు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు పోలీసులు.
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి కారు బీభత్సం కేసులో పోలీసుల అనుమానాలే నిజమయ్యాయి. మద్యం మత్తులోనే కారు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఏడుగురు యువకులు హోలీ పండుగ రోజు పార్టీ చేసుకునేందుకు ముందురోజే మద్యాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఓ స్నేహితుడి రూమ్‌లో పార్టీ చేసుకున్న ఆ ఏడుగురు.. మిగిలిన మద్యాన్ని ఎవరికీ అనుమానం రాకుండా కొబ్బరిబోండాల్లో నింపారు. మద్యం నింపిన బోండాలతోనే యువకులు ప్రిజం పబ్‌లో హోలీ ఈవెంట్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు పోలీసులు. పూర్తి వివారాలు ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లి HMT హిల్స్ ఆదిత్య హోమ్స్‌కాలనీకి చెందిన రోహిత్ MBA పూర్తి చేశాడు. రైస్ గోడౌన్స్ బిజినెస్‌లో బాగానే సంపాదించాడు. చేతులో కావాల్సినంత డబ్బు..బయటకు వెళ్లేందుకు ఏకో స్పోర్ట్స్ కారు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు..పార్టీలు, పబ్బులు. రోహిత్‌తోపాటు ఉన్న యువతి పేరు గాయత్రి.
KPHB కాలనీకి చెందిన గాయత్రి…రోహిత్ స్నేహితురాలు. షార్ట్ ఫిల్మ్‌లో జూనియర్ ఆర్టిస్టు ఆమె. యూ ట్యూబ్‌లో గాయత్రి షార్ట్ ఫిల్మ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. వీకెండ్ వచ్చినా…ఏదైనా పండుగొచ్చినా రోహిత్, గాయత్రి కలిసి ఎంజాయ్ చేసేవారు. అదే క్రమంలో హోలి పండుగ సందర్భంగా ఇద్దరూ కలిసి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో హోలి ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడ వీళ్లిద్దరూ పీకల్లోతు మద్యం తాగి హోలీ ఈవెంట్‌లో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత రోహిత్, గాయత్రి కారులో బయలుదేరారు. మత్తులో అతివేగంగా కారు నడుపుతూ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే గార్డెన్‌లో పనిచేసే మహేశ్వరి అనే మహిళ చనిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి మృతి చెందింది. కారు నడిపి ప్రమాదానికి కారణమైన రోహిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పీకలదాకా తాగి వాహనం నడిపిన ఘటనలో చనిపోయిన మహేశ్వరి అనే మహిళది విషాద ఘటన. నారాయణపేటజిల్లాకి చెందిన మహేశ్వరి, తన భర్త చిన్న రాములుతో కలిసి 18 ఏళ్ల క్రితం గచ్చిబౌలికి వలస వచ్చారు. 2005లో ఎల్లా హోటల్ నిర్మాణం సమయంలో గోడకూలి చిన్నరాములు మృతి చెందాడు. ఇప్పుడు అదే హోటల్ ముందు భార్య మహేశ్వరి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మొత్తానికి హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ సంస్కృతి మితిమీరిపోతోంది. పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల తీరు మారడం లేదు. ఫూటుగా మద్యం సేవించి రోడ్డు మీద ఇష్టారాజ్యంగా అతివేగంతో వాహనాలు నడపడంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
Also Read: Nalgonda: వీడిన మిస్టరీ.. కారును కాలువలోకి తోసేసింది వారే.. వెలుగులోకి కీలక విషయాలు