AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: వీడిన మిస్టరీ.. కారును కాలువలోకి తోసేసింది వారే.. వెలుగులోకి కీలక విషయాలు

హత్యలకు ప్లాన్.. ఆత్మహత్యలకు ఛాన్స్‌.. ఈ అనుమానాలకు తెరదించుతూ కాలువలో కారు మిస్టరీని ఛేదించారు నల్గొండ పోలీసులు.

Nalgonda: వీడిన మిస్టరీ.. కారును కాలువలోకి తోసేసింది వారే.. వెలుగులోకి కీలక విషయాలు
Nalgonda Car Mystery
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 19, 2022 | 5:52 PM

Share

Telangana: హత్యలకు ప్లాన్.. ఆత్మహత్యలకు ఛాన్స్‌.. ఈ అనుమానాలకు తెరదించుతూ కాలువలో కారు మిస్టరీని ఛేదించారు నల్గొండ పోలీసులు. కారును కాలువలోకి తోసేసింది ఇద్దరు దివ్యాంగులుగా గుర్తించారు. వేములపల్లి మండలం(Vemulapalle Mandal) అన్నపురెడ్డి గూడెం(Annapareddiguda)కాలువలో కారు ఘటనపై చాలా అనుమానాలు తెరమీదకొచ్చాయి. ఆత్మహత్య చేసుకోవడానికే కాలువలోకి కారును తోసేశారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీసులు మాత్రం ఇద్దరి మానసిక పరిస్థితి బాలేదని.. ఆ కారణంగానే కారును కాలువలోకి తీసేసినట్టు నిర్ధారించారు. దేవుళ్లమని వాదించే తమ పిల్లల మానసిక పరిస్థితి బాలేదన్నారు తండ్రి రామాంజనేయులు. కొంతమంది కారణంగానే వాళ్లు చెడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.దగ్గర సాగర్ ఎడమ కాలువలో కారును తోసినట్టు ఐడెంటిఫై చేశారు. కారును కాలువలోకి తోసేసింది మల్లిఖార్జున్‌, విఘ్నేశ్వరిలు. వీళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు. రిటైర్డ్ హెడ్మాస్టర్‌ రామాంజనేయులు బిడ్డలు. నాలుగేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే కారు కొన్నారు. నెల నెలా మెయింటెనెన్స్‌ కోసం తండ్రి డబ్బు పంపిస్తున్నాడు. అయితే తన మీద కోపంతోనే వారు కారును కాల్వలోకి తోసేశారని అన్నారు రామాంజనేయులు. వారు తోయడంతో కారు కాలువలో కొట్టుకుపోయింది. అన్నపురెడ్డి గూడెం దగ్గర పడిపోయిన కారు దాదాపు మూడు కిలోమీటర్ల తర్వాత వేములపల్లి దగ్గర ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కెళ్లి వివరాలపై ఆరాతీశారు. ఫైనల్‌గా అది మల్లిఖార్జున్‌, విఘ్నేశ్వరిల పనిగా తేల్చారు. ఇద్దరికి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు. కారును కాల్వలోంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Also Read: టీడీపీలో హ్యాకింగ్ కలకలం.. పార్టీ అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్..