Mozilla Firefox: ఫైర్‌ఫాక్స్ యూజర్లను అలర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేదంటే..
Mozilla Firefox: మీరు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే వెంటనే మీ వెబ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోండని కేంద్ర ప్రభుత్వం (Central Government) సూచిస్తోంది. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో పలు భద్రతా లోపాలు ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు...
Mozilla Firefox: మీరు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే వెంటనే మీ వెబ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోండని కేంద్ర ప్రభుత్వం (Central Government) సూచిస్తోంది. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో పలు భద్రతా లోపాలు ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CIRT-IN) ఈ బ్రౌజర్‌లో పలు భ్రదతా లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ కారణంగా ఫైర్ ఫాక్స్ ఉపయోగించే యూజర్ల ఖాతాల లాగిన్ వివరాలు హ్యాకర్లకు చేరవేస్తోందని తేలింది. మెజిల్లా ఫైర్‌ఫాక్స్ 98 అప్‌డేట్ కంటే ముందు అన్ని బ్రౌజర్స్‌లో ఈ భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
98 వెర్షన్‌కి ముందు ఉన్న అన్ని బ్రౌజర్స్‌లో భద్రతా లోపాలను గుర్తించారు. ఈ కారణంగా అనేక భద్రతా లోపాలు తలెత్తుతున్నట్లు భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వెంటనే బ్రౌజర్‌ను అప్‌డ్ చేసుకోమని యూజర్లకు సూచిస్తోంది. ఇంతకీ బ్రౌజర్‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే.. ముందుగా మెజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం ఫైర్‌ఫాక్స్ టూల్‌బార్ కుడి వైపున ఉన్న మెనూ బటన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత హెల్ప్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఫైర్‌ఫాక్స్ ఏబౌట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. అప్‌డేట్స్ కోసం సెర్చ్ చేయాలి. తర్వాత బ్రౌజర్ అప్‌డేట్ అవుతోంది. బ్రౌజర్ డౌన్‌లోడ్ పూర్తికాగానే ‘రిస్టార్ట్ టు అప్‌డేట్’పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
Also Read: Punjab New Cabinet: కొలువుదీరిన పంజాబ్ కేబినెట్.. 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
పెళ్లి పీటల మీద వరుడి సడెన్ ట్విస్ట్.. బంధువులు షాక్..!
Viral Video: కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయించిన యజమాని !! వీడియో వైరల్