AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab New Cabinet: కొలువుదీరిన పంజాబ్‌ కేబినెట్‌.. 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

Punjab New Cabinet: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో భాగంగా పంజాబ్‌లో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసింది. మహిళ సహా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు..

Punjab New Cabinet: కొలువుదీరిన పంజాబ్‌ కేబినెట్‌.. 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
Subhash Goud
|

Updated on: Mar 19, 2022 | 12:21 PM

Share

Punjab New Cabinet: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో భాగంగా పంజాబ్‌లో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసింది. మహిళ సహా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (CM Bhagwant Mann). ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పంఆజబ్‌ అసెంబ్లీ సభాపతిగా కల్తార్‌సింగ్‌ సంధ్‌వాన్‌ను నామినేట్‌ చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు సాధించుకుంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ కాకుండా తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు.

శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. మంత్రులుగా డాక్టర్ దల్జీత్ కౌర్, హర్పాల్ సింగ్ చీమా, హర్బజన్ సింగ్, లాల్ చంద్, డాక్టర్ విజయ్ సింగ్లా, గుర్మిత్ సింగ్, లాల్ జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్ జింపా, కటారుచక్,హరజోత్ సింగ్ బెయిన్స్, కుల్దీప్ సింగ్ ధలివాల్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మంత్రులను అభినందించిన సీఎం:

నిజాయితీ పాలన అందించడానికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అభినందించారు.

ఇవి కూడా చదవండి:

Big News Big Debate: ఏపీలో పెగాసెస్‌తో బేరాలు కుదిరాయా? ప్రకంపనలు సృష్టిస్తున్న దీదీ వ్యాఖ్యలు.. టీడీపీ రియాక్షన్ ఏంటి?

TDP Twitter: టీడీపీలో హ్యాకింగ్ కలకలం.. పార్టీ అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్..