Viral Video: హోలికా దహన్‌లో భక్తుడి అగ్ని స్నానం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..
Mathura Holika Dahan: చేతిలో నిప్పురవ్వ పెడితేనే తట్టుకోలేం. అలాంటిది ఓ వ్యక్తి హోలీ రోజు ప్రత్యేక స్నానం చేశాడు. ఏకంగా మంటల్లోకి దూకి, అగ్ని స్నానం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నె

Mathura Holika Dahan: చేతిలో నిప్పురవ్వ పెడితేనే తట్టుకోలేం. అలాంటిది ఓ వ్యక్తి హోలీ రోజు ప్రత్యేక స్నానం చేశాడు. ఏకంగా మంటల్లోకి దూకి, అగ్ని స్నానం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హోలీకి ముందురోజు నిర్వహించే పూజా కార్యక్రమంలో భాగంగా ఓ భక్తుడు చేసిన సాహసం వైరల్ అవుతోంది. యూపీలోని మథుర ప్రాంతంలోని ఫాలెన్ గ్రామంలో హోలీకా దహన్ (Holi 2022) కార్యక్రమం నిర్వహించారు ప్రజలు. గ్రామస్తులంతా హోలికా దహన్ చూసేందుకు గూమికూడిన సమయంలో, ఓ వ్యక్తి చేసిన పనిని చూసి అవాక్కయ్యారంతా. మోను పాండా (monu panda) అనే ఓ వ్యక్తి సడెన్‌గా వచ్చి, హోలీకా దహన్ కోసం వేసిన మంటల్లో దూకాడు. కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు మోను. ఆ మంటల్లో అతను ఎందుకు దూకాడనే విషయం అర్ధం కాక, అక్కడున్నవాళ్లంతా షాక్‌కు గురయ్యారు.
మోను పాండా ప్రహ్లాదుడి పరమభక్తుడు. గత నెల రోజులుగా ఇక్కడి ప్రహ్లాదుని ఆలయంలో తపస్సు చేస్తున్నారు పాండా. హోలికా దహన్ సందర్భంగా, ప్రహ్లాద్ కుండ్‌లో మునక వేసిన తర్వాత, ప్రహ్లాదుని గుడిలో పూజలు చేశారు మోను పాండా. ఆ తర్వాత హోలిక అగ్నిలోకి దూకారు. మంటల్లోంచి క్షేమంగా బయటపడిన మోనుపాండాను చూసిన గ్రామస్తులు, పర్యాటకులు అభినందించారు. భక్తప్రహ్లాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ ముందు రోజు, మథుర ప్రాంతం ఛత్ర తహసీల్‌లోని ఫాలెన్ గ్రామంలో ఈతరహా పూజలు జరుగుతాయి. హోలీ కా దహన్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా వస్తుంటారు భక్తులు. కానీ ఏ సంవత్సరం ఇలా, మంటల్లో జనం దూకిన దాఖలాలు లేవు.
వైరల్ వీడియో..
View this post on Instagram
అందుకే ఈసారి మోనుపాండా మంటల్లో దూకి అగ్నిస్నానం చేయడం వైరల్ అయ్యింది. హిందువులు ఏ పండుగ చేసిన దాని వెనుక ఓ చరిత్ర ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటారు. హోలీ పండుగ హోలికా దహన్‌తో ప్రారంభం అవుతుంది.
Also Read:
