Yogi Adityanath: సగర్వంగా రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్.. ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారు..

UP CM Yogi Adithyanath: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు విక్టరీ సాధించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముహుర్తం ఖరారయ్యింది. ఈ నెల 25న యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Yogi Adityanath: సగర్వంగా రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్.. ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారు..
Yogi Adityanath
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 19, 2022 | 1:32 PM

UP CM Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు విక్టరీ సాధించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 25న యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యూపీ ఎన్నికల్లో ఘన విజయంతో 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఆ రాష్ట్ర అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. 70 ఏళ్ల ఉత్తరప్రదేశ్‌ రాజకీయ చరిత్రను యోగి ఆదిత్యనాథ్‌ తిరగరాశారు. సగర్వంగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనులవుతున్నారు. యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4 గం.ల శుభముహుర్తంలో యోగి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమంలో 50 వేల మంది సభికులతో పాటు 200 మంది వీవీఐపీలు పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. యూపీకి చెందిన విపక్ష నేతలను కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. యూపీలో బీజేపీ విజయంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కీలక పాత్ర పోషించారు. ఈ లబ్ధిదారులను కూడా కొందరిని యోగి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

403 అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో.. అధికార బీజేపీ 255 స్థానాల్లో (కూటమి పక్షాలతో కలిసి 273) విజయం సాధించి తిరిగి అధికార పగ్గాలు కైవసం చేసుకోవడం తెలిసిందే. ఒక్కసారి యూపీ చరిత్రలోకి వెళ్తే… గత 37 ఏళ్లలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది లేదు. ప్రతి ఐదేళ్ల కోసారి యూపీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మార్పు కోరుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డులన్నింటినీ యోగి తిరగరాశారు. అంతేకాదు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి పోటీ చేసి బ్రాహ్మాండమైన మెజార్టీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు.

1989 తర్వాత నాలుగుసార్లు 30శాతానికి పైగా ఓటింగ్ సాధించిన ఏకైక పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. మోదీ, అమిత్ షా, యోగీ త్రయం రచించిన ఎన్నికల వ్యూహాల ముందు అన్ని పార్టీలు చిత్తయిపోయాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ కూటమి 125 స్థానాలకు (ఎస్పీ 111) పరిమితమయ్యింది.

చరిత్రను తిరగరాసిన యోగీ..

ఉత్తరప్రదేశ్‌ ఎంతో మంది హేమాహేమీల్ని చూసింది. నారాయణ్‌ దత్ తివారీ, కల్యాణ్‌ సింగ్, రాజ్‌నాథ్‌ సింగ్, ములాయంసింగ్ యాదవ్, మాయావతి ఇలా ఎంతో మంది యోధానుయోధులు. కానీ 70 ఏళ్ల యూపీ రాజకీయ చరిత్రలో ఎవరూ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ అసాధ్యాన్ని…అత్యంత ఈజీగా సుసాధ్యం చేసి చూపించారు యోగి…

ఉత్తరప్రదేశ్‌ ఎంతో మంది హేమాహేమీల్ని చూసింది. నారాయణ్‌ దత్ తివారీ, కల్యాణ్‌ సింగ్, రాజ్‌నాథ్‌ సింగ్, ములాయంసింగ్ యాదవ్, మాయావతి ఇలా ఎంతో మంది యోధానుయోధులు. కానీ 70 ఏళ్ల యూపీ రాజకీయ చరిత్రలో ఎవరూ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ అసాధ్యాన్ని…అత్యంత ఈజీగా సుసాధ్యం చేసి చూపించారు యోగి..

మోదీ వారసుడిగా, కాబోయే పీఎంగా ఇప్పటికే యోగి పేరు ఓ రేంజ్‌లో మార్మోగుతోంది. జాతీయ రాజకీయాల్లో మోదీకి అసలు సిసలు ప్రత్యామ్నాయమని పార్టీ శ్రేణులు కూడా బలంగా విశ్వసిస్తున్నాయి. ఇప్పటికే ఎంపీగా తానేంటో నిరూపించుకున్నారు యోగి. గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచిసత్తా చాటారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిపించారు.. పార్టీకి ఘన విజయం అందించారు. అనంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి..పాలనలో తన స్టైల్‌ ఏంటో చూపించారు. ప్రజల మెప్పు పొందారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి సీఎం అవుతున్నారు.

యోగీ మాస్‌ లీడర్‌గా పేరు పొందారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడపడం ద్వారా జనం మనిషి అనిపించుకున్నారు. మరీ ముఖ్యంగా యూపీని ఎప్పటి నుంచో పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించారు. ఈ 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించారు. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. గుండాలు గడగడలాడిపోయేలా చేశారు. ఎంతో మంది గ్యాంగ్‌స్టార్లను కనుసైగతోనే కతం చేశారు.

ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌరీగర్‌ వాల్ జిల్లా, పాంచూర్ యోగి స్వగ్రామం. 1972 జూన్ 5న జన్మించారు. గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఉన్న తండ్రి మహంత్ అవైద్యనాథ్ మరణాంతరం ఆ బాధ్యతలు స్వీకరించారు యోగి. అక్కడి నుంచే రాజకీయప్రస్థానాన్ని ప్రారంభించి తిరుగులేని నేతగా ఎదిగారు. మొత్తానికి సెమీఫైనల్‌గా భావిస్తున్న UP అసెంబ్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టడం ద్వారా..యూపీ మీదుగా ఢిల్లీకి ల్లైన్ క్లియర్ చేసుకున్నారు.

Also Read..

Happy Birthday Mohan Babu: ఆయన నటనకు ఎదురులేదు.. డైలాగ్‌కు తురుగులేదు..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బందికి సర్కార్ కఠిన ఆదేశాలు.. అలా చేస్తే సెలవుల్లో కోతే