AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బందికి సర్కార్ కఠిన ఆదేశాలు.. అలా చేస్తే సెలవుల్లో కోతే

ఏపీలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఏప్రిల్‌ 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందకు సంబంధించి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బందికి సర్కార్ కఠిన ఆదేశాలు.. అలా చేస్తే సెలవుల్లో కోతే
Ap Govt Doctors
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 19, 2022 | 6:42 PM

Share

AP Government Docotors: ఏపీలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఏప్రిల్‌ 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ బయోమెట్రిక్‌ హాజరును ప్రవేశపెట్టింది. డాక్టర్లు, సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేసింది. బయోమెట్రిక్‌ పర్యవేక్షణ కోసం ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. విధులకు వచ్చి పర్మిషన్ లేకుండా బయటికి వెళ్లిన వారి సెలవుల్లో కోత ఉంటుందని పేర్కొంది. డాక్టర్లతోపాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా.. సొంత పనులపై బయట తిరుగుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అడిగేవారు లేకపోడంతో.. వైద్యులు, సిబ్బంది ఎవరిష్టం వచ్చినట్లు వారు సమయపాలన లేకుండా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో సర్కార్‌ సీరియస్‌గా ఫోకస్ పెట్టి బయోమెట్రిక్ తీసుకువచ్చింది.  పేదలకు సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వైద్య సిబ్బందిలో వణుకు మొదలయ్యింది.

కాగా వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిలోనే ఉన్నాం అని చెప్పేలా గంటగంటకీ ఓ సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చెయ్యాలంటూ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కంఠమనేని భాస్కర్‌ ఇచ్చిన ఆదేశాలపై భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజలు ఈ నిర్ణయాన్ని అభినందిస్తుంటే.. వైద్య వర్గాలు మాత్రం ఇదేం పద్దతని ప్రశ్నిస్తున్నాయి.

Also Read: Tirumala: శ్రీవారి లడ్డూల తయారీకి కొత్త చిక్కు.. వినూత్న ఫార్ములాతో చెక్ పెట్టిన టీటీడీ