Telangana: రూ. 1250 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉద్యోగాలు.. హైదరాబాద్‌కు క్యూకడుతోన్న అమెరికా కంపెనీలు.

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా వెళ్లిన మంత్రి కేటీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని పలు ప్రముఖ కంపెనీలతో చర్చలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా సంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ గ్యాస్‌ దిగ్గజ కంపెనీ..

Telangana: రూ. 1250 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉద్యోగాలు.. హైదరాబాద్‌కు క్యూకడుతోన్న అమెరికా కంపెనీలు.
KTR
Follow us

|

Updated on: May 21, 2023 | 9:00 AM

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా వెళ్లిన మంత్రి కేటీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని పలు ప్రముఖ కంపెనీలతో చర్చలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా సంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ గ్యాస్‌ దిగ్గజ కంపెనీ ‘టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ’ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ఉన్నతాధికారుల బృందం శనివారం సమావేశమైంది. హ్యూస్టన్‌లోని ‘టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ’ క్యాంపస్‌లో కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రస్‌ డాల్‌, ఇండియా హెడ్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ హౌసిలా తివారీతోపాటు ఇతర అధికారులు కేటీఆర్‌ను కలిశారు.

ఇవి కూడా చదవండి

ఈ సంస్థ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌తోపాటు ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీని ప్రారంభించనుంది. తొలి దశలో రూ. 1250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో సుమారు 3500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా రూ.5,400 కోట్ల విలువైన ఎగుమతులను చేయబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇదిల ఉంటే ఎఫ్‌ఎంసీ టెక్నాలజీస్‌, టెక్నిప్‌ల విలీనంతో ఏర్పడిన ‘టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో దాదాపు 30,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..