AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Rain Alert: వాతావరణ శాఖ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం...

TS Rain Alert: వాతావరణ శాఖ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.
Rain Alert
Narender Vaitla
|

Updated on: May 21, 2023 | 7:26 AM

Share

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది.

ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్‌ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.

జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. వెల్గటూర్, మద్దునూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరద దాటికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమాగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లుపడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..